Ram lala First look Pics: ఘనంగా ప్రాణ ప్రతిష్ట ఘట్టం, బాలరాముని ఫస్ట్‌లుక్ ఫోటోలు మీ కోసం

5 శతాబ్దాల కల సాకారమైంది. సుదీర్ఘంగా ఎదురుచూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరంలో అత్యంత ఘనంగా రామ్‌లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మంగళ వాయిద్యాల నడుము, వేద మంత్రోఛ్ఛారణలతో క్షణాల వ్యవధిలో కార్యక్రమం ముగిసింది. ఆ అద్భుత దృశ్యాలు మీ కోసం..

Ram lala First look Pics: 5 శతాబ్దాల కల సాకారమైంది. సుదీర్ఘంగా ఎదురుచూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరంలో అత్యంత ఘనంగా రామ్‌లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మంగళ వాయిద్యాల నడుము, వేద మంత్రోఛ్ఛారణలతో క్షణాల వ్యవధిలో కార్యక్రమం ముగిసింది. ఆ అద్భుత దృశ్యాలు మీ కోసం..

1 /6

రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రాముని తొలి చూపు ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ దర్శనమిచ్చింది. 

2 /6

అయోధ్యలో నిర్మించిన రామ జన్మభూమి మందిరంలో రామ్‌లలా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ పక్కన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కన్పిస్తారు. 

3 /6

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ సారధ్యం వహించారు. రామ్‌లలా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మోదీ చేతులమీదుగా సాగింది.

4 /6

దాదాపు గంట సేపు రామ్‌లలా పూజ, హారతి కార్కక్రమాలు సాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు కొనసాగించారు. శ్రీరాముని కళ్ల గంతలు తొలగించిన వెంటనే జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి.

5 /6

అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 500 ఏళ్లుగా నిరీక్షణ ఉందనే విషయం ఇవాళ్టి తరానికి తెలియకపోవచ్చు. వేద మంత్రోఛ్చారణల నడుమ, అత్యంత భక్తిశ్రద్ధలతో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 

6 /6

ఉదయం 11.30 గంటల్నించే దేశమంతా టీవీలకు అతుక్కుపోయింది. అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ముగిసింది.