Lucky Gemstones: ఈ రత్నాలు ధరిస్తే ఇక మీరు రారాజులే, ఎవరు ఏ రత్నం ధరించాలి

Lucky Gemstones: జ్యోతిష్యం శాస్త్రంకు ప్రాధాన్యత ఉన్నట్టే హిందూమతంలో  రత్న శాస్త్రానికి కూడా మహత్యముంది. రత్నశాస్త్రంలో వివిధ రకాల రత్నాలు, రంగు రాళ్లు, పగడాలు, ముత్యాల గురించి ప్రస్తావన ఉంది. ప్రతి రత్నానికి ఏదో ఒక గ్రహంతో సంబంధముంటుంది. ఏది ఏ గ్రహానిదో తెలుసుకుని మాత్రమే ధరించాలంటారు జ్యోతిష్య పండితులు. 

Lucky Gemstones: ఎవరిదైనా జాతకంలోని కుండలిలో గ్రహం బలహీనంగా ఉంటే సంబంధిత గ్రహానికి చెందిన రత్నాన్ని ధరించమని సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల గ్రహ స్థానం బలపడి మంచి జరుగుతుందని నమ్మకం. లేకపోతే లేని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్ధిక కష్టాలు కూడా వెంటాడవచ్చు.
 

1 /6

ముత్యాలకు నేరుగా చంద్రునితో సంబంధముంటుందంటారు. చంద్రుడు శాంతిగా ఉండాలని ధరిస్తుంటారు. ముత్యం ధరించిన వారం రోజుల్లో ప్రభావం కన్పిస్తుంది. మేషం, కర్కాటకం, తులా, మీన రాశులకు ముత్యం చాలా మంచిది. 

2 /6

గోమేథికం రత్నానికి మంగళ గ్రహంతో సంహబంధముంటుంది. 21 నుంచి 30 రోజుల్లో ప్రభావం కన్పిస్తుంది. మంగళ దోషాల్ని దూరం చేసేందుకు ఇది అద్బుతంగా పనిచేస్తుంది. 

3 /6

గ్రీన్ స్టోన్ సంబంధం నేరుగా బుధుడితో ఉంటుంది. సరైన రీతిలో ధరిస్తే 7 రోజుల తరువాత శుభ ప్రభావం కన్పిస్తుంది. 

4 /6

ఎమెరాల్డ్. ఇది అన్ని గ్రహాలకు చెందింది. 15 రోజుల తరువాతే దీని ప్రభావం కన్పిస్తుంది. మిధునం, కన్యా, వృషభ రాశులవారికి ఇది చాలా మంచిదని చెబుతారు. 

5 /6

డైమండ్ ప్రభావం నేరుగా శుక్రగ్రహంతో ఉంటుంది. డైమండ్ ధరిస్తే అంతా మంచి జరుగుతుందని అంటారు. ఇది దరించిన 22 రోజుల తరువాత ప్రభావం కన్పిస్తుంది. మిధునం, వృషభం, తుల , కన్యా, మకర రాశులకు చాలా చాలా మంచిది.

6 /6

రత్నశాస్త్రం ప్రకారం బ్లూ స్టోన్ సంబంధం నేరుగా శని గ్రహంతో ఉంది. ఈ రత్నాన్ని చాలా శక్తివంతమైందిగా, ఆకర్షణీయమైందిగా చెబుతారు. ఎవరికైనా ఇది సెట్ అయిందంటే..ఇక ఆ వ్యక్తి రారాజు కావడం ఖాయం