Most Expensive Train: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. రోజుకు 2 కోట్లకు పైగా ప్రయాణాలు చేస్తుంటారు. అదే సమయంలో అత్యంత ఖరీదైన, లగ్జరీ రైళ్లు కూడా ఉన్నాయి. అలాంటి ఓ రైలు గురించి తెలుసుకుందాం. ఇందులో సౌకర్యాలు 7 స్టార్ హోటల్ని తలదన్నేలా ఉంటాయి..
అత్యధికంగా 21 లక్షల టికెట్ కూడా ఉంది. ఈ రైలులో టికెట్ బుక్ చేసేందుకు మహారాజా ఎక్స్ ప్రెస్ అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉంది. ఐఆర్సీటీసీ ద్వారా కూడా బుక్ చేయవచ్చు
ఇంత లగ్జరీ వసతులు కలిగి రైలు టికెట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రైలు టికెట్ అనేది జర్నీ రూట్, ఎంచుకున్న కేటగరీపై ఆధారంగా ఉంటుంది. 4,13,210 రూపాయల నుంచి 11 లక్షల 44 వేల 980 రూపాయల వరకు టికెట్ ఉంటుంది.
ఈ రైలులో ప్రెసిడెన్షియల్ సూట్, డీలక్స్, డీలక్స్ కేబిన్, జూనియన్ సూట్ వంటి ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఇందులో షవర్ బాత్రూం కూడా ఉంటుంది. బెడ్రూం, మినీ బార్, లైవ్ టీవీ వంటి వసతులు ఉంటాయి.
ఈ రైలులో 8 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ 8 రోజుల్లో తాజ్ మహల్, ఖజురహో మందిరం, రణథంబోర్, వారణాసి ప్రాంతాల్ని సందర్శించవచ్చు. ప్రస్తుతం దేశంలో ఈ రైలు వివిధ ప్రాంతాల మీదుగా తిరుగుతుంది.
ఈ రైలు దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు. ఇందులో 5 స్టార్ హోటల్లో లభించే సౌకర్యాలు ఉంటాయి. ఇందులో 8 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణ కాలంలో అద్భుతమైన విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి. రైలు రాజమహల్లా అలంకరించి ఉంటుంది. రాజుల ఠీవి ఉంటుంది. కుర్చీలు, బెడ్స్ అన్ని అలానే ఉంటాయి
మహారాజా ఎక్స్ప్రెస్లో ప్రపంచ స్థాయి మహారాజుల సౌకర్యాలు ఉంటాయి. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు ఇది. ఈ రైలు 2010లో ప్రారంభమైంది
ఇండియన్ రైల్వేస్కు చెందిన ఓ రైలు టికెట్ 5 స్టార్ హోటల్ ధరకు సమానంగా ఉంటుంది. దేశంలో అత్యంత ఖరీదైన రైలు మహారాజా ఎక్స్ప్రెస్. ఈ రైలు టికెట్ లక్షల్లో ఉంటుంది. ఇదొక 5 స్టార్ ట్రైన్. మహారాజుల విలాస సౌకర్యాలు ఉంటాయి
దేశంలో లగ్జరీ రైళ్లు చాలానే ఉన్నాయి. వందేభారత్, రాజధాని, శతాబ్ది వంటి ఫాస్ట్ రైళ్లతో పాటు అత్యంత ఖరీదైన, లగ్దరీ రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రైళ్లలో టికెట్ ఎంతో వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏడాది జీతం కూడా తక్కువైపోతుంది. 2 బీహెచ్కే ఫ్లాట్ ఖరీదు చేసేంతగా ఉంటుంది