Anushka Sharma To Vini Raman: బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్.. వారి లైఫ్ పార్ట్‌నర్స్ ఫోటోలు

Anushka Sharma To Vini Raman: ఐపిఎల్ 2023 పాల్గొంటున్న వివిధ జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్స్ గురించి క్రికెట్ ప్రియులు అందరికీ తెలుసు. కానీ వారి పర్సనల్ లైఫ్ మేటర్స్ గురించి, ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. (Source: Instagram)

  • Apr 06, 2023, 22:01 PM IST

Anushka Sharma To Vini Raman: అందుకే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్ అయిన ఆటగాళ్ల లైఫ్ పార్ట్‌నర్స్ ఎవరు, వృత్తిరీత్యా వారి ప్రొఫెషన్ ఏంటి అనే ఆసక్తికరమైన అంశాలను ఈ ఫోటోల ద్వారా తెలుసుకుందాం రండి. (Source: Instagram)

1 /7

Anushka Sharma To Vini Raman: బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎవరంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఆల్ రౌండర్ ఎవరు, వికెట్ కీపర్ ఎవరు, స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవరు , పేస్ బౌలర్ ఎవరు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికి అందరి దగ్గర సమాధానం ఉంటుంది. మరి వారి లైఫ్ పార్ట్‌నర్స్ ఎవరు, వారు ఏ రంగంలో కొనసాగుతున్నారు అని అడిగితే అతి కొద్ది మంది వద్ద మాత్రమే సమాధానం ఉంటుంది. మరి ఆ డీటేల్స్ మీకు తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఆ డీటేల్స్ . (Source: Instagram)

2 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కేప్టేన్ విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల లవ్ స్టోరీ గురించి చెప్పనక్కర్లేదు. 2017 లో ఈ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీళ్లిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కూతురు పుట్టింది. ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ఆ గారాలపట్టికి వామిక అనే పేరు పెట్టారు. (Source: Instagram)

3 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తిక్ స్క్వాష్ స్టార్ ప్లేయర్ దీపిక పల్లికల్ ని పెళ్లి చేసుకున్నాడు. 2018 లో వీళ్ల వివాహం జరిగింది. వీళ్లకు కవల పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు మగ పిల్లలకు కబీర్, జియాన్ అని నామకరణం చేశారు. (Source: Instagram)

4 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టేన్ ఫాఫ్ డూప్లెసిస్ 2013 లో ఇమారి విస్సర్ ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు జోయ్, అమేలియా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. (Source: Instagram)

5 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ మన ఇండియా అమ్మాయినే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు విని రామన్. గతేడాదే వీళ్ల పెళ్లి జరిగింది. విని రమణ్ ఆస్ట్రేలియాలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. అక్కడే ఏర్పడిన వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (Source: Instagram)

6 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ డేవిడ్ విల్లీ విషయానికొస్తే.. డేవిడ్ ఇంగ్లీష్ సింగర్, గేయ రచయిత, నటి అయిన కెరోలిన్ గూడ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కెరోలిన్ మల్టీటాలెంటెడ్ లేడీ. (Source: Instagram)

7 /7

Anushka Sharma To Vini Raman: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేసర్, ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హెజల్‌వుడ్‌కి చెరీనా మర్ఫీ క్రిస్టియన్‌తో వివాహం అయింది. చెరీనా వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్. (Source: Instagram)