Anupama Parameswaran: టీషర్ట్ మడతబెట్టి.. కిల్లింగ్ లుక్స్‌లో అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Photos: కార్తికేయ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. 'ప్రేమమ్‌' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ.. 'అ ఆ' మూవీలో నెగిటివ్ రోల్ పోషించి మెప్పించింది. ఆ తరువాత శతమానం భవతి మూవీతో హీరోయిన్‌గా హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది.

  • Dec 01, 2022, 22:07 PM IST
1 /5

వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఈ బ్యూటీకి తరువాత బ్యాడ్‌ లక్‌ వెంటాడింది. వరుసగా ఫ్లాప్ సినిమాలు పలకరించాయి. దీంతో ఈ అమ్మడి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.

2 /5

మధ్యలో 'రాక్షసుడు' మూవీ సక్సెస్ కావడంతో అనుపమకు కాస్త బూస్ట్ వచ్చింది. అయినా సినిమా ఆఫర్లు రాకపోవడంతో అప్పటివరకు పెట్టుకున్న బౌండరీని క్రాస్ చేసింది.   

3 /5

'రౌడీబాయ్స్' మూవీలో హద్దులు చెరిపేసింది. లిప్‌ లాక్‌ వంటి ఇంటెన్స్ సీన్లలోనూ యాక్ట్ చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. అనుపమపై మాత్రం ట్రోలింగ్ జరిగింది. 

4 /5

రీసెంట్‌గా నిఖిల్‌ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీతో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది.

5 /5

కార్తికేయ 2 మూవీ ఇచ్చిన హిట్‌తో ఈ మలయాళ కుట్టికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. '18పేజెస్‌', 'బట్టర్‌ఫ్లై', 'సిరెన్‌' వంటి సినిమాలు అనుపమ చేతిలో ఉన్నాయి. మరోవైపు నిత్యం ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.