Ice Melting: అంటార్కిటికాలోని మంచు సముద్రం ఊగుతోంది. ప్రతిరోజూ ఎంతోకొంత కుదించుకుపోతోంది. Ross Ice Shelf అనేది అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన మంచు పర్వతం. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్ దేశపు ఆకారంలోని ఈ పర్వతం రోజూ 1-2 సార్లు 6-8 సెంటమీటర్లు కుదించుకుపోతోంది.
Ice Melting: 19వ శతాబ్దంలో ఈ పర్వతాన్ని కనుగొన్నారు. జియో ఫిజికల్ రీసెర్చ్ ప్రకారం Ross Ice Shelf రోజూ కుదించడానికి కారణం మంచు ధార. ఈ మంచు ధార ఈ మంచు శిఖరం మధ్యలోంచి వెళ్తోందని తెలుస్తోంది. అంటార్కిటికాలోని చాలా మంచు శిఖరాల్లో గ్లోబర్ వార్మింగ్ ముప్పు ఏర్పడింది.
మంచు శిఖరాలపై జరిగే ఈ ప్రక్రియ వల్లనే మంచు భూకంపాలు సంభవిస్తుంటాయి. అదే జరిగితే చాలావరకూ గ్లేసియర్లు వేగంగా కరుగుతాయి. ఫలితంగా సముద్రమట్టాల్లో పెరుగుదల కన్పిస్తుంది.
గత 50 ఏళ్ల రీసెర్చ్ ప్రకారం కొన్ని మంచు ధారలు వేగంగా ప్రవహిస్తున్నాయి. రాస్ ఐస్ షెల్ఫ్‌పై జీపీఎస్, సిస్మోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. మంచు ధారల్లోని అలల వేగం గంటకు 10 వేల కిలోమీటర్లకు పైగా ఉందని తెలుస్తోంది. ఈ అలలు కదులుతున్నప్పుడు 5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లలో వ్యాపించిన మంచు శిఖరాలు కుదించవచ్చు.
సాధారణంగా మంచు నదిలో అలలు స్లిప్ ఈవెంట్ నుంచి మొదలవుతాయి. ఈ ప్రక్రియ చాలావరకూ భూకపం లాంటిదే.
అంటార్కిటికాలో అత్యంత మందంతో మంచు దుప్పటి ఉంది. దీన్నించే మంచు ఆధారిత నదులు ప్రవహిస్తున్నాయి. మంచు శిఖరాలు సాధారణంగా గ్లేసియర్ మంచు నదుల మార్గంలో అంతరాయం కల్గిస్తుంటాయి.