Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 నిముషాలకు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరీ సైతం ఈ కార్యక్రామంలో పాల్గొన్నారు.
చంద్రబాబు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో.. ఏపీ మంత్రులు, అచ్చేన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు చంద్రబాబుకు సచివాయం సిబ్బంది, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక చంద్రబాబు ఎన్నికల సందర్భంగా మెగాడీఎస్సీ ఇస్తానని హమీ ఇచ్చారు. దీనిలో భాగంగా.. 16,347 టీచర్ పోస్టులకు పచ్చజెండా ఊపారు. దీంతో అభ్యర్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసంతకం, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటనింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం, సామాజిక ఫింఛన్లు రూ. 4 వేలకు పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణపై నాలుగొ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. మెగా డీఎస్సీ నోటీఫికేషన్ ద్వారా..ఎస్ జీటీ- 6,371, పీఈటీ - 132, స్కూల్ అసిస్టెంట్లు - 7725, టీజీటీ- 1781, పీజీటీ- 286, ప్రిన్సిపాల్ - 52 పోస్టులకు నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బిజీగా ఉంటున్నారు. ప్రమాణ స్వీకారం చేశాక నేరుగా కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
అక్కడ నుంచి మరల విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సచివాలంలో సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఇచ్చిన హమీలపై సంతకాలు చేసి ఏపీ పాలనలో తనదైన మార్కును మరోసారి ప్రారంభిచారు.