Anchor Anasuya: మల్టీకలర్ డ్రెస్‌లో మైమరిపించిన యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj Latest Photos: బుల్లితెరకు గుడ్ బై చెప్పేసిన యాంకర్ అనసూయ.. బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. మరోవైపు నిత్యం లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా మల్టీకలర్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ను పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Feb 09, 2023, 09:24 AM IST
1 /5

అనసూయ గురించి టాలీవుడ్ ఆడియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో ఆకట్టుకుంది.  

2 /5

రంగస్థలం మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్ చేసిన తరువాత వెండితెరపై అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి.   

3 /5

అటు బిగ్ స్క్రీన్‌పై మెరుస్తూనే.. జబర్దస్త్‌ యాంకర్‌గానూ కొనసాగింది. అయితే ఈ షోలో కొందరి తీరు నచ్చకపోవడంతో స్మాల్ స్క్రీన్‌కు గుడ్ బై చెప్పేసింది.   

4 /5

తెలుగు సినిమాలతోపాటు తమిళం, మలయాళం సినిమాలకు కూడా ఈ బ్యూటీ సైన్ చేసిందట. దీంతో తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉంటోంది.  

5 /5

అనసూయ 2008లో భద్రుక కాలేజ్‌లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఓ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా.. ఆ తరువాత సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా పని చేసింది.