Anant Ambani Marriage: అనంత్ అంబానీ పెళ్లిలో పీఎం నరేంద్ర మోడీ, పవన్ సందడి..

Anant Ambani: అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే మాములు విషయం కాదు. మన దేశంలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు వేసి ఈ పెళ్లిని కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. ఈ  పెళ్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ, క్రీడా, మీడియా ఇలా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

1 /7

అనంత్ అంబానీ వివాహాం ప్రముఖ ఫార్మా గ్రూపు అధినేత కూతురు రాధిక మర్చంట్ తో ఘనంగా జరిగింది. ప్రపంచం నివ్వెర పోయేలా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి దేశ, విదేశాలకు చెందిన పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

2 /7

ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

3 /7

అనంత్ అంబానీ పెళ్లి సందడిలో పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మాటా ముచ్చట జరుపుకున్నారు.

4 /7

ఈ పెళ్లిలో పవన్ కళ్యాణ్ ను ముఖేష్ అంబానీ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అంతేకాదు అనంత్ అంబానీ పెళ్లిలో ప్రముఖులు పవన్ ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి ఎగబడ్డారు.  

5 /7

అటు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

6 /7

అటు అనంత్ అంబానీ పెళ్లిలో ముఖేష్ తమ్ముడు చిన్న అంబానీ అదే అనిల్ అంబానీ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు.

7 /7

అనంత్ అంబానీ పెళ్లిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..రష్యా, ఆస్ట్రియా పర్యటన తర్వాత  కొత్త దంపతులను ఆశీర్వదించారు.