Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్

Amazon Great Republic Day Sale 2023: గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అమెజాన్‌లో జరుగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. iQOO 9 SE 5G, యాపిల్ ఐఫోన్ 12, శామ్‌సంగ్ గెలాక్సీ S22 5G, iQOO 9 5G, శామ్‌సంగ్ గెలాక్సీ A73 5G, iQOO 9 SE 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి.
 

  • Jan 17, 2023, 08:47 AM IST
1 /5

Apple iPhone 12 (128GB) ప్రారంభ ధర రూ. 64,900. అయితే రిపబ్లిక్ డే సేల్‌లో ఫోన్ రూ.55,900కి అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఫోన్ ధర రూ.54,650 అవుతుంది. ఆ తర్వాత రూ.18,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు పాత ఫోన్‌కి బదులుగా ఇంత తగ్గింపు పొందినట్లయితే.. ఫోన్ ధర రూ.36,600 అవుతుంది.

2 /5

Samsung Galaxy S22 సిరీస్‌ను గతేడాది లాంచ్ చేసింది. ఈ ఫోన్ బాగా పాపులర్ అయింది. రూ.85,999కి ఈ ఫోన్ లాంచ్ అవ్వగా.. ఈ సేల్‌‌లో రూ.49,999కి లభిస్తుంది. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే.. మీకు రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. మీ పాత ఫోన్‌ను రూ.18,050కు ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.30,699లో అందుబాటులోకి వస్తుంది.   

3 /5

iQOO 9 SE 5G ఫోన్ ప్రారంభ ధర రూ.39,990. అమెజాన్ సేల్‌లో రూ.28,990కి అందుబాటులో ఉంది. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మీకు రూ.2,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఆ తరువాత రూ.18,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే.. మీరు చాలా తక్కవ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.  

4 /5

Samsung Galaxy A73 5G వాటర్ ఫ్రూఫ్ స్మార్ట్‌ఫోన్. రూ.49,999కి ఈ ఫోన్ లాంచ్ అయింది. కానీ అమెజాన్‌లో రూ.41,899కి అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపుపై రూ.1,250 తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత ఫోన్‌పై రూ.18,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.   

5 /5

iQOO 9 5G ప్రారంభ ధర రూ.49,990, అయితే రూ.42,990కి అందుబాటులో ఉంది. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు రూ.9,250 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా.. మీరు రూ.28,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.