Clove Health Benefits: లవంగాలను లైట్ తీసుకుంటున్నారా..?.. ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..

Clove Health Benefits: మనలో చాలా మంది అన్నం తిన్న తర్వాత లవంగాలు, విలాయీచీల లాంటివి తింటుంటారు.ముఖ్యంగా లవంగాలు తినడం వల్ల బోలేడు ఆరోగ్య లాభాలున్నాయని నిపుణులు చెబుతుంటారు.

1 /6

లవంగాలను సుగంధ ద్రవ్యాలకు రాజుగా చెబుతుంటారు. అందుకే ఇంట్లో బిర్యానీలు, స్పైసీ వంటకాలు ఏవి చేసిన కూడా లవంగాలను తప్పుకుండా ఉపయోగిస్తారు. లవంగాలు లేనిదే కొన్ని పదార్థాలకు అస్సలు టెస్ట్ రాదు. అందుకే లవంగాలకు ఆరెంజ్ లో డిమాండ్ ఉంది.  

2 /6

లవంగాలకు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. కొందరు లవంగాలను నోటిలో వేసుకుని నములుతుంటారు. ఇది నోటి చిగురుకున్న దంత సమస్యలను దూరం చేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. దీంతో నోటికి సంబంధించిన సమస్యలు రాకూండా ఉంటాయి.  

3 /6

కొందరికి కారులో లేదా బస్సుల్లో జర్నీ చేస్తున్నామంటూ వామిటింగ్ వస్తుంది. అలాంటి వారు ఒక్క లవంగం నోటిలో వేసుకుంటే.. వామిటింగ్ సెషన్ కు బాయ్ బాయ్ చెప్పేయోచ్చు. అంతేకాకుండా యాక్టివ్ గా కూడా ఉంటుంది. అందుకే చాలా మంది జర్నీలలో లవంగంను తప్పనిసరిగా పెట్టుకుంటారు.

4 /6

సీజనల్ మార్పుల వల్ల కొందరికి వెంటనే జలుబు, దగ్గులు వస్తుంటాయి. గొంతంతా పట్టేసినట్లు అవుతుంది.  ఇలాంటి వారికి లవంగం పౌడర్, మిరియాలను మిక్స్ చేసి, పాలల్లో కలుపుకుని రాత్రి పూట తాగితే వెంటనే ఉపశమనం ఉంటుంది. 

5 /6

రెగ్యులర్ గా తలనొప్పితో బాధపడేవారు, బీపీలు ఉన్నవారికి లవంగం బాగా పనిచేస్తుంది. దీనిలో యూజెనాల్ అనే తైల పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. కానీ లవంగంను అదే పనిగా మాత్రం అతిగా తినకూడదు.  

6 /6

కీళ్ల నొప్పులతో బాధపడేవారు, అజీర్తిస సమస్యలు, పొట్ట ఉబ్బటం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి లవంగం ఎంతో ఉపశమనం కల్గచేస్తుంది.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)