Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్..

Allu Arjun in Rampachodavaram for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న Pushpa movie shooting లో పాల్గొనేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన Guest house కి వెళ్తున్నాడని తెలుసుకున్న అభిమానులు వందలాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు.

  • Feb 03, 2021, 15:57 PM IST

Allu Arjun in Rampachodavaram for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న Pushpa movie shooting లో పాల్గొనేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన Guest house కి వెళ్తున్నాడని తెలుసుకున్న అభిమానులు వందలాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు. స్టైలిష్ స్టార్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది.

1 /6

తనని చూడ్డానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లు అర్జున్ తన కారులో ( Allu Arjun's care ) నిలబడి వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు.

2 /6

ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు, తమ ఫేవరైట్ హీరోను తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటీపడ్డారు.

3 /6

అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ ( Allu Arjun's viral video ) అయ్యింది.

4 /6

Allu Arjun ట్రక్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అటవీ ప్రాంతంలో స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. పుష్ప సినిమాలో పలు ముఖ్య సన్నివేశాలను రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అడవిలో చిత్రీకరిస్తున్నారు.

5 /6

ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి Pushpa shooting part పూర్తి చేసి ఆగస్టు 13న సినిమాను విడుదల చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

6 /6

అల్లు అర్జున్ సరసన Rashmika Mandanna జంటగా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  Also read : Shruti Haasan remuneration: సలార్ మూవీ కోసం రేటు పెంచిన శృతి హాసన్