Shani - Shukra Yuthi: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక మంచి యోగదాయకంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడికి శని దేవుడికి మంచి స్నేహ బంధం గ్రహ మైత్రి ఉంది. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
Shani - Shukra Yuthi: ప్రస్తుతం శనిదేవుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో డిసెంబర్ లాస్ట్ వీక్ లో విలాసవంతమైన గ్రహంగా పేరున్న శుక్రుడు కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు వారికీ అనుకోని ఫలితాలతో జీవితంలో ఎన్నడు చూడని డబ్బును కళ్ల చూస్తారు.
మిథున రాశి : శుక్ర, శని దేవుడు గ్రహాల కలయిక వల్ల మిథున రాశి వారికి జీవితమే మారిపోబోతుంది. ఈ రెండు గ్రహాల కలయికల వల్ల సంఘంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారరీత్యా విదేశాలకు వెళ్లే ఛాన్స్ కలగనుంది. వ్యాపారంలో మీరు ఎన్నడు ఎక్స్ పెక్ట్ చేయని లాభాలను అందుకుంటారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికీ శుక్ర, శని గ్రహాల కలయిక వలన ఆకస్మిక ధనలాభంతో పాటు.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదొన్నతి కలిగే అవకాశం. జీతాల్లో పెరుగుదల నమోదు అవుతోంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
మేషం: శని దేవుడు-శుక్ర గ్రహ కూటమి కారణంగా మేష రాశి వారికీ అనుకోని అదృష్టం తీసుకురాబోతుంది. అంతేకాదు కెరీర్ లో ఎన్నడు చూడని ఆదాయన్ని కళ్లారా చూస్తారు. వ్యాపారం చేసే ఈ రాశుల వారికీ ఇది గోల్డెన్ పీరియడ్ గా అభివర్ణించాలి.
కుంభం: శని, శుక్రుల కలయిక వలన కుంభ రాశి వారికి విశేష ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు తమ వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉండే అవకాశాలున్నాయి. కొత్త వ్యక్తులను కలయికల వల్ల ఫ్యూచర్ లో మంచి లాభాలను అందుకునే అవకాశాలున్నాయి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ఆధ్యాత్మిక సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వడింది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.