Aditi Rao Hydari Personal Life: ప్రముఖ బ్యూటీ అదితి రావు హైదరి 17 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే అన్ని చూసేసిన ఈమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగి, ఒక స్టార్ హీరోను ఇంకో పెళ్లి చేసుకుంది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగ్ , పెళ్లిళ్లు ఆపై విడాకులు.. అత్యంత సహజంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎప్పుడు డేటింగ్ చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారో తెలియదు. కొంతమంది ప్రేమలో పడి వివాహం చేసుకుంటే.. ఇంకొంతమంది ప్రేమలోనే విడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది చిన్న వయసులోనే పెళ్లి, పెటాకులు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ తరువాత ఒక వయసుకు వచ్చిన తర్వాత మళ్లీ పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరి కూడా ఒకరు.
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలంగాణ అమ్మాయి 17 ఏళ్ల వయసులోనే సత్యదీప్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తర్వాత 28 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.
విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత అదితి హీరోయిన్ గా తన కెరీర్లో బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపిన ఈమె పలుచోట్ల అతడితో కలిసి కనిపించింది. దీంతో మీడియా కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.ఇక మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త వహించారు ఈ జంట. ఇదిలా ఉండగా మహాసముద్రం సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ అప్పటి నుంచే ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక తర్వాత శర్వానంద్ పెళ్లి వేడుకలలో కూడా కనిపించారు.
అయితే ఒకసారి ముంబైలోని హోటల్ నుంచి బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫోటోలు తీస్తే వారిపై సిద్దార్థ్ ఫైర్ కూడా అయ్యారు. అయితే ఎట్టకేలకు వనపర్తి లో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయకుల దేవాలయంలో వీరి వివాహం జరిగింది.ఏదేమైనా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ చూసేసిన ఈమె ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సిద్ధార్థ్ ని వివాహం చేసుకుంది. ఇకనైనా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.