Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
చాలా మంది సినిమా రంగంఅంటేనే గ్లామర్ గా ఉండాలని భావిస్తారు. అదే విధంగా అక్కడ క్విడ్ ప్రో కో ఉంటుందని, మంచి చాన్స్ లు రావాలంటే.. దేనీకైన రెడీగా ఉండాలని తరచుగా వార్తలు విన్పిస్తు ఉంటాయి.
ఇటీవల అనేక ఘటనల్లో హీరోయిన్లు మీటూ వేధింపులకు గురైన ఘటనలు తరచుగా వార్తలో ఉంటున్నాయి. కొంత మంది తారలు.. ఫెమస్ అవ్వడం కోసం.. గ్లామర్ డోస్ లు పెంచుతూ పోతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. దీనికి పూర్తిగా అపోసిట్ గా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో .. తాజాగా, నటి ప్రియా భవానీ శంకర్ ఆ గ్లామర్ డోస్ లపై చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.టాలెంట్ ఉంటే ఏ రంగంలోనైన రాణిస్తారని గ్లామర్ షో అవసరంలేదని నటి చెప్పుకొచ్చారు.
నటి ప్రియా భవానీ శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. .తన మూవీ బ్లాక్ గురించి మాట్లాడారు. గ్లామరస్ పాత్రలంటే..తనకు అంతగా ఇష్టంలేదన్నారు. అదే విధంగా ఫ్యాషన్ పేరుతో కొంత మంది అతిగా ఎక్స్ పోజ్ లు చేస్తుంటారని మండిపడ్డారు.
నా వరకు మాత్రం.. శరీరాన్ని ఒక వస్తువుగా భావించనన్నారు. ఆడియన్స్ కోసం.. గ్లామర్ ను చాపల పర్చలేనని వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా నెగేటివ్ రోల్స్ చేసేందుకు ఇష్టపడన్నారు.
కొంత మంది ఫెమ్ అవ్వాలంటే.. గ్లామర్ ను షార్ట్ కట్ గా భావిస్తున్నారని, అది నిజంకాదని నటి ప్రియా భవానీ శంకర్ అన్నారు. మరోవైపు బ్లాక్ మూవీ ..జీవా హీరోగా నటించారు. ఈ మూవీకి బాలసుబ్రమణి దర్శకత్వం వహించారన్నారు.
అదే విధంగా ఈ సినిమా పూర్తిగా హారర్ జానర్ లో తెరకెక్కిందన్నారు. అక్టోబరు 11న అంటే.. దసరాకు ఒక రోజు ముందు ఆడియన్స్ ముందుకు వస్తుందన్నారు నటి ప్రియాభవానీ శంకర్..