Actress Pranitha Subhash: ప్రణీత సుభాష్‌కి కాబోయే భర్త ఇలా ఉండాలంట

నటి ప్రణితా సుబాష్ తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి చాలా క్లియర్‌ అభిప్రాయంతో ఉంది. అభిమానులతో ఇటీవల జరిగిన చిట్‌చాట్‌లో ప్రణీత సుబాష్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక విషయాలు పంచుకుంది.

  • Jan 09, 2021, 23:08 PM IST

నటి ప్రణితా సుబాష్ తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి చాలా క్లియర్‌ అభిప్రాయంతో ఉంది. అభిమానులతో ఇటీవల జరిగిన చిట్‌చాట్‌లో ప్రణీత సుబాష్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక విషయాలు పంచుకుంది. ప్రణీత సుభాష్ తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. అన్నింటికంటే ముందుగా నేను చూసే అతడి ఎత్తు గురించేనని ఓపెన్ అయ్యింది. నా భర్త ఆరు అడుగుల పొడవు ఉండాలి. అతను 6 అడుగుల మీద మరో 4 అంగుళాలు ఎత్తు ఎక్కువున్నా నేను పట్టించుకోను అని చాలా స్పష్టంగా చెప్పింది.

1 /4

తాను కేవలం 5 అడుగులు 2 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉన్నప్పటికీ.. తన భర్త మాత్రం పొడవుగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రణీత చెప్పుకొచ్చింది.

2 /4

2019లో కథా నాయకుడు సినిమాలో అతిథి పాత్రలో తళుక్కుమన్న ప్రణీత సుభాష్‌ ఆ తర్వాత మరే ఇతర తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు.

3 /4

గతేడాదే భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే హిందీ సినిమాకు సైన్ చేయడం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఆ తర్వాత హిందీలోనే హంగామా 2 అనే సినిమాలో సైతం ప్రణీతకు ఛాన్స్ లభించింది.

4 /4

లాక్ డౌన్ సమయంలో కొంతమంది వలసకూలీలకు తనకు తోచిన రీతిలో సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రణీత సుభాష్‌ ప్రస్తుతం సౌత్‌లో అవకాశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది.