Actress Anushka Sharma Sensational Statements Before Marriage I Was Mother: భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీతో పెళ్లికి ముందే తాను తల్లినయ్యాయని సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Anushka Sharma: క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందే తాను తల్లినయ్యాయని ప్రకటన చేసి కలకలం రేపారు.
Anushka Sharma: దాదాపు ఏడేళ్లు డేటింగ్ అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2021లో వామిక జన్మించగా.. ఇటీవల రెండో సారి మగబిడ్డకు అనుష్క జన్మనిచ్చింది.
Anushka Sharma: అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాను ఒక మంచి తల్లిగా చెప్పుకున్నారు. తాను పెళ్లికి ముందే తల్లిని అని చెప్పారు.
Anushka Sharma: ఆ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. "నేను పెళ్లికి ముందు కూడా తల్లిని అయ్యాను. ఇదంతా రణబీర్ కపూర్ వల్లనే. నేను అతడిని కొడుకులా చూసుకోవడమే కారణం. అతడి చేష్టలను నేను భరించినప్పటి నుంచి నాలో మంచి తల్లి ఉందని భావిస్తున్నా" అని అనుష్క తెలిపింది.
Anushka Sharma Movies: అనుష్క శర్మ, రణబీర్ కపూర్ కలిసి చాలా సినిమాల్లో చేశారు. 2015లో విడుదలైన 'బాంబే వెల్వెట్'లో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా ప్రచారంలో అనుష్క మాట్లాడుతూ.. 'రణ్‌బీర్ కపూర్ చిన్నపిల్లాడిలా ఉన్నాడు. నేను అతడికి తల్లిలాగా ఉన్నా' అని వెల్లడించింది.
Anushka Sharma: 'మేకప్ రూమ్‌కి వచ్చి తిరుగుతున్నాడు. అతను నా బ్యాగ్ మొత్తం వెతుకుతుంటాడు. ఫోన్లో ఏదో చేస్తుంటే అక్కడికి వచ్చి చిలిపి పనులు చేస్తుంటాడు. అతడి అల్లరి, చిలిపి పనులను తట్టుకున్నా. దీంతో నేను మంచి తల్లిని అయ్యా' అని అనుష్క వెల్లడించింది.