Vijay TVK Party: దళపతి విజయ్‌ ప్రకంపనలు.. పార్టీ జెండా.. అజెండాతో ప్రత్యర్థులకు చుక్కలే

Actor Vijay Ready To Tamil Politics: తమిళనాడులో స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ప్రకంపనలు రేపారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా పార్టీకి సంబంధించిన జెండా.. అజెండా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీనికి ముహూర్తం కూడా నిర్ణయించారు. విజయ్‌ దూకుడుతో తమిళనాడులోని ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

1 /8

Vijay TVK Party: తమిళనాడులో 2026లో రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసి పోటీ చేసేందుకు విజయ్‌ పక్కా ప్రణాళికతో రాజకీయాల్లోకి దిగుతున్నారు.

2 /8

Vijay TVK Party: ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. అవినీతి నిర్మూలన కోసమే పార్టీ పెడుతున్నట్లు విజయ్‌ ప్రకటించారు.

3 /8

Vijay TVK Party: ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

4 /8

Vijay TVK Party: 'తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు ఇది నాంది. గెలుపు మనదే' అంటూ లేఖలో విజయ్‌ తెలిపారు. జెండా ఆవిష్కరణతోపాటు పార్టీ సిద్ధాంతాలను వివరిస్తానని వెల్లడించారు.

5 /8

Vijay TVK Party: చెన్నైలోని కార్యాలయంలో టీవీకే పార్టీ జెండా ఆవిష్కరణ చేయబోతున్నట్లు విజయ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

6 /8

Vijay TVK Party: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) జెండాను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.

7 /8

Vijay TVK Party: ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారానికి తెరపడింది. దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి సిద్ధమయ్యారు.

8 /8

Vijay TVK Party: లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్‌ రాజకీయాల్లోకి రావడంతో ప్రధాన పార్టీలకు చెమటలు తప్పవని తెలుస్తోంది. మరి విజయ్‌ రాజకీయ వ్యూహం ఎలా ఉండనుందో.. రాజకీయాల్లో విజయం సాధిస్తాడో లేదో చూడాలి.