Schools Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

Schools and Colleges Holiday in Telangana: కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకొవాలని కూడా పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు.

1 /5

కొన్ని రోజుల క్రితమే సమ్మర్ హలీడేస్ ముగిసాక.. స్కూళ్లు, కాలేజీలు మరల ఓపెన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వ్యాపారానికి తెరతీశాయి. విద్యను ఒక బిజినెస్ లాగా మార్చేశాయి. ఇప్పటికే సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నారు.

2 /5

ప్రతి ఏడాది సమ్మర్ ముగియగానే స్కూళ్లు మొదలైపోతాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని టార్గెట్ గా ప్రైవేటు బడుల్లో చేర్పిస్తుంటారు. ఇక్కడ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అందినకాడికి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు.

3 /5

అనేక రకాలుగా యూనీఫామ్, బుక్స్ లు, స్పోర్ట్స్, ఎక్స్ ట్రా యాక్టివిటీస్ అంటూ ఇష్టమున్నట్లు ఫీజులను గుంజుతున్నారు. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ పలు చోట్ల దీనిపై నిరసలను చేపట్టింది. విద్యాశాఖకు కూడా దీనిపై చర్యలు తీసుకొవాలంటూ వినతి పత్రాలు సైతం ఇచ్చారు.

4 /5

తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీల్లో జూన్ 26 న బంద్ ను పాటించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేటు..విద్యాసంస్థల  అధిక ఫీజుల వసూళ్ల మీద నిరసనగా ఈ బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్ల నుంచి తమ స్టూడెంట్స్ ల ఫోన్ లకు సిబ్బంది హలీడే ఇస్తున్నట్లు మెసెజ్ లు చేస్తున్ననట్లు సమాచారం.

5 /5

బుధవారం రోజున ఏబీవీపీ బంద్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, బంద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యారెంట్స్ తమ పిల్లలతో ఇతర ప్లాన్ లు వేసుకొవడంతో బీజీగా ఉన్నట్లు సమాచారం.