8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. 8వ వేతన సంఘం అమలు చేస్తే జీతం ఎంతంటే..?

8th Pay Commission Latest Updates: ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాడ్ చేస్తున్నారు. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తికావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతోపాటు పెన్షన్‌లో కూడా పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

1 /11

7వ వేతన సంఘాన్ని 2014లో ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు కావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది.  

2 /11

ఎన్నికలకు ముందు ప్రకటన ఉంటుందని ఆశించినా ఆ దిశగా ఎలాంటి ప్రకటన రాలేదు. బడ్జెట్‌లో ఉంటుందని నమ్మకం పెట్టుకోగా.. నిరాశే ఎదురైంది.  

3 /11

8వ వేతన సంఘం ఏర్పాటు చేసినా.. కమిటీ సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.  

4 /11

7వ వేతన సంఘం పదవీకాలం 31 డిసెంబర్ 2025 ముగుస్తుందని అంటున్నా.. ఈ విషయం ఎక్కడా పేర్కొనలేదు. దీంతో పదేళ్ల తరువాత కొత్త వేతన సంఘం అమలు చేస్తారా లేదా అనేది అయోమయంగా మారింది.  

5 /11

8వ వేతన సంఘం ఏర్పాటుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి చాలా వినతులు వెళ్లాయి.   

6 /11

కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల బేసిక్ పే రూ.18 వేల నుంచి రూ.34,560కి, కనీస పెన్షన్ రూ.17,280కి పెరిగే అవకాశం ఉంది.  

7 /11

ఏ కమిషన్‌లో ఎంత జీతం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.. 4వ కేంద్ర వేతన సంఘం- జీతాల పెంపు: 27.6 శాతం, కనీస వేతన స్కేల్: రూ.750; 5వ కేంద్ర పే కమిషన్- శాలరీ హైక్: 31 శాతం, బేసిక్ శాలరీ స్కేల్: రూ.2,550; 6వ సెంట్రల్ పే కమిషన్- ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 1.86 రెట్లు, జీతం పెంపు: 54 శాతం, కనీస వేతన స్కేల్: రూ.7 వేలు; 7వ సెంట్రల్ పే కమిషన్- ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: 2.57 రెట్లు, పే పెంపు: 14.29 శాతం, కనీస వేతన స్కేల్: రూ.18 వేలు.  

8 /11

6వ పే కమిషన్ నుంచి 7వ పే కమిషన్‌కు మారిన సందర్భంలో ఉద్యోగుల సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి మార్చాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం 2.57 వద్ద ఫిక్స్ చేసింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా కేంద్ర ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. దీంతోపాటు కనీస పింఛను కూడా రూ.3500 నుంచి రూ.9 వేలకు పెరిగింది.    

9 /11

8వ వేతన సంఘం ఏర్పాటు కచ్చితంగా ఉంటుందని.. అయితే కాస్త సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబతున్నారు.   

10 /11

ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కొత్త పే కమిషన్ అమలైతే ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల ఉంటుంది. జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుతాయి.   

11 /11

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.