7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు. ఈ డేటాను ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై క్లారిటీ వస్తుంది. బడ్జెట్ తరువాత డీఏ పెంపు ఎంత ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో 4 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది.
జూన్ నెలకు సంబంధించిన AICPI ఇండెక్స్ డేటా ఇవాళ (జూలై 31) రిలీజ్ చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.
ఈ డేటాను బేస్ చేసుకుని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.
6 నెలల AICPI సూచిక సంఖ్యల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతుంది. ఇప్పటివరకు మే నెలకు సంబంధించిన AICPI డేటా ఉంది.
రానున్న ఆరు నెలల ద్రవ్యోల్బణం రేటు మార్పులను బట్టి వినియోగదారుల ధరల సూచిక (CPI) నెలవారీ డేటాను రిలీజ్ చేస్తారు. ద్రవ్యోల్బణం AICPIలో హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది.
AICPI ప్రతి నెలా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఆర్థిక మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులకు వేతనాలను నిర్ణయించేందుకు ఈ డేటాను రూపొందిస్తారు.
మే నెల వరకు ఉన్న AICPI డేటా, అధిక ద్రవ్యోల్బణం ఆధారణంగా డీఏ 4 శాతం లేదా 5 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీఏ 54 నుంచి 55 శాతానికి చేరే అవకాశం ఉంది. ఈరోజు జూన్ ఏఐసీపీఐ లెక్కలు వస్తే డీఏ పెంపుపై స్పష్టత వస్తుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.