Loksabha Elections 2024: మొదటిసారి ఈవీఎంను ఎక్కడ వినియోగించారు..? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..!

Interesting Facts About EVMs: గతంలో ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల హడావుడి మాములుగా ఉండేది కాదు. ఎన్నికల కౌంటింగ్‌కు కూడా చాలా సమయం పట్టేది. ఈ కష్టాలన్నిటికి చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకువచ్చింది. వీటి ద్వారా ఓటింగ్ ప్రాసెస్, ఓట్ల లెక్కింపు చాలా ఈజీగా మారిపోయింది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

1 /5

మన దేశంలో మే 1982లో కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో 50 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను తొలిసారిగా ఉపయోగించారు. 1983 తర్వాత ఓటింగ్ యంత్రాల వినియోగానికి చట్టపరమైన మద్దతు అవసరమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈవీఎంలను ఉపయోగించలేదు.  

2 /5

1988 డిసెంబరులో పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని సవరించి, ఓటింగ్ యంత్రాలను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇచ్చింది. 1998 నుంచి 2001 మధ్య దశలవారీగా ఎన్నికలలో ప్రవేశపెట్టారు.  

3 /5

2004 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 10.75 లక్షల ఈవీఎంలను వినియోగించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో దాదాపు 55 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు.  

4 /5

ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, కేబుల్ ద్వారా అనుసంధానించిన బ్యాలెట్ యూనిట్ ఉంటాయి. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఆయన అనుమతి ఇస్తే.. బ్యాలెట్‌లో ఓటు వేయాలి.  

5 /5

పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాత ఒక బటన్ నొక్కి ఎన్నికల ఫలితాలను వెంటనే తెలుసుకోవచ్చు. ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు తయారు చేస్తాయి.