Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లులను EMI రూపంలో చెల్లిస్తే మీకు 5 ప్రయోజనాలు

ఆర్థిక అవసరాల నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడంతో అత్యవసరంగా క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, ఎలా వినియోగించాలో తెలియక కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 

1 /5

క్రెడిట్ కార్డు(Credit Cards) ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల మీరు బిల్లు చెల్లింపులో EMI ఆప్షన్ ఎంచుకున్నా ఎలాంటి వడ్డీ పడదు. మీరు చెల్లించల్సిన వడ్డీ మొత్తాన్ని ఆఫర్ రూపంలో పొందుతారు. కనుక వడ్డీ లేకుండానే ఈఎంఐ సౌకర్యం లభిస్తుంది. 

2 /5

సాధారణంగా అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సంస్థలు, వ్యాపారులు, కొన్ని రిటైల్ స్టోర్లు క్రెడిట్ కార్డులపై పండుగ ఆఫర్లు ప్రకటిస్తాయి. బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు కంపెనీలతో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో క్రెడిట్ కార్డు వినియోగదారులకు స్పెషల్ ఈఎంఐ ఆఫర్లు లభిస్తాయి. Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

3 /5

మీ క్రెడిట్ కార్డు బిల్లులు కంపెనీని బట్టి ప్రతినెలా జనరేట్ చేస్తారు. దానికి అనుగుణంగా మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరిగా చెల్లించాలి. లేకపోతే మీకు రూ.1000 వరకు జరిమానా పడుతుంది. మరో విషయం ఏంటంటే జరిమానా మొత్తంతో కలిపి పూర్తి బకాయిల చెల్లింపులపై వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అందుకే బిల్లు మొత్తాన్ని మీరు EMI రూపంలోకి మార్చుకుని వాయిదాల పద్ధతిలో బిల్లు తేలికగా కట్టవచ్చు. Also Read: Secured Credit Card: మీతో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి ఎవరికి ఇస్తారో తెలుసా!

4 /5

కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై ప్రి ఆప్రూవ్డ్ లోన్ ఆఫర్లు వస్తుంటాయి. మీకు వచ్చిన లోన్ ఆఫర్‌కు ఓకే చెబితే, డాక్యమెంట్లు సమర్పిస్తే అకౌంట్‌లోకి నగదు జమ అవుతుంది. ఈఎంఐ ద్వారా ప్రతినెలా వాయిదాల రూపంలో లోన్ చెల్లిస్తే, మీరు జరిమానాల సమస్య తప్పుతుంది. వాయిదాలతో చెల్లిస్తే లోన్ బారం అంతగా ఉండదు. Also Read: Axis Bank Credit card: ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే క్రెడిట్ కార్డు

5 /5

చేతిలో నగదు లేని అత్యవసర సమయంలో మీకు కావాల్సిన సేవలు వినియోగించుకునేందుకు, వస్తువులు కొనుగోలు చేయడానికి ఈఎంఐ కార్డులతో ఆ ప్రయోజనాలు పొందవచ్చు.