1983 World Cup Anniversary: చరిత్రలో మర్చిపోలేని క్షణం.. దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించిన హీరోలు వీళ్లే!

టీమిండియా క్రికెట్ చరిత్రను మలుపు తిప్పినరోజు.. మన జాతీయ జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన రోజు.. 1983 జూన్ 25న భారత జట్టు సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్.. అప్పటి ప్రపంచస్థాయి మేటి జట్లను ఓడించి వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగివచ్చింది. ఫైనల్‌లో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌పై విజయం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుని నేటితో 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ హీరోలను ఓసారి గుర్తు చేసుకుందాం..

40 years of India’s 1983 World Cup: టీమిండియా క్రికెట్ చరిత్రను మలుపు తిప్పినరోజు.. మన జాతీయ జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన రోజు.. 1983 జూన్ 25న భారత జట్టు సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్.. అప్పటి ప్రపంచస్థాయి మేటి జట్లను ఓడించి వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగివచ్చింది. ఫైనల్‌లో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌పై విజయం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుని నేటితో 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ హీరోలను ఓసారి గుర్తు చేసుకుందాం..

1 /14

టీమిండియా క్రికెట్ గురించి ప్రస్థావన వచ్చిన ప్రతిసారి గుర్తుకువచ్చే మొదటి పేరు కపిల్ దేవ్. తన స్పూర్తిదాయకమైన కెప్టెన్సీతోపాటు బ్యాట్స్‌మెన్‌గానూ.. బౌలర్‌గానూ జట్టును ముందుండి నడిపించాడు. జింబాబ్వేపై అజేయంగా 175 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ చరిత్రలో మర్చిపోలేనిది.   

2 /14

ఆల్‌రౌండర్‌ అమర్‌నాథ్‌ భారత్ ప్రపంచకప్ సాధించడంలో కీరోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్‌లో అద్భుత పర్ఫామెన్స్‌తో జట్టును గెలిపించాడు.   

3 /14

భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అందించిన సేవలు ఎన్నటికీ మరువలేం. ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా గొప్ప పర్ఫామెన్స్ చేయకపోయినా.. ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు నడిపించాడు.  

4 /14

ఓపెనర్ శ్రీకాంత్ టోర్నీ ఆద్యంతం తన దూకుడు బ్యాటింగ్‌లో అలరించాడు. టాప్ ఆర్డర్‌లో శ్రీకాంత్ మెరుపులు జట్టుకు ఉత్సాహన్నిచ్చింది.   

5 /14

సందీప్ పాటిల్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్‌లో వెస్టిండీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు.   

6 /14

కీలక సమయాల్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో యశ్‌పాల్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 61 పరుగులతో రాణించాడు.  

7 /14

సమర్థవంతమైన స్వింగ్ బౌలింగ్‌తోపాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్‌గా రోజర్ బిన్నీ అదరగొట్టాడు. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై 29 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాడు.  

8 /14

తన బ్యాటింగ్‌తోపాటు ఆఫ్ స్పిన్‌ బౌలింగ్‌తో మెరుపులు మెరిపించాడు కీర్తి ఆజాద్. గ్రూప్ దశలో జింబాబ్వేపై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కపిల్ దేవ్‌తో కలిసి జట్టును ఒడ్డుకు చేర్చాడు. 

9 /14

మీడియం పేస్ బౌలింగ్‌పాటు లోయర్ ఆర్డర్‌లో హిట్టింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మదన్ లాల్. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 31 పరుగులకు 3 వికెట్లు పడగొట్టిన స్పెల్ క్రికెట్‌ అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.    

10 /14

సయ్యద్ కిర్మాణి వికెట్ల వెనుక తన నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. కీలక క్యాచ్‌లు, స్టంపింగ్‌లతో మైదానంలో మెరుపులు మెరిపించాడు.   

11 /14

స్వింగ్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరు బల్వీందర్ సంధు. ఫైనల్‌లో వెస్టిండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను అవుట్ చేసిన డెలివరీ చరిత్రలో నిలిచిపోయింది.   

12 /14

దిలీప్ వెంగ్‌సర్కార్ టోర్నమెంట్ సమయంలో కీలక సమయాల్లో పరుగులు అందించాడు. గ్రూప్ దశలో వెస్టిండీస్‌పై అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.   

13 /14

ఆల్‌రౌండర్ రవిశాస్త్రి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పొదుపుగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడంతోపాటు మిడిల్ ఆర్డర్‌లో కీలకమైన నాక్‌లు ఆడాడు.  

14 /14

టోర్నమెంట్‌లో సునీల్ వాల్సన్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాకపోయినా.. అతని సహకారాన్ని విస్మరించలేము. ప్రాక్టీస్ సెషన్లలో హార్డ్ వర్క్‌తో సాయపడ్డాడు.