Tips For Mehendi To Turn Red At Home: ఈ అరుదైన చిట్కాలతో మీ చేతులు ఎర్రగా పండుతాయి!

గోరింటాకు మహిళలకు ఎంతో ఇష్టమైన అలంకారం. గోరింటాకు పండుగలకు, పుట్టిన రోజున ఇతర సందర్భాలలో ఎక్కువగా ఉపయోగిస్తాము. అయితే  దీని పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గోరింటాకు ఎర్ర పండాలి చాలా మంది కోరుకుంటారు. అయితే  ఎర్రగా గోరింటాకు పండాలి అంటే ఈ చిట్కాలను మీరు తప్పకుండా పాటించాలి.

  • Feb 29, 2024, 14:23 PM IST
1 /7

గోరింటాకు అనేది వివాహిత స్త్రీలు ధరించే ఒక ముఖ్యమైన ఆభరణం. వివాహిత స్త్రీ స్థితిని సూచిస్తుంది మరియు అదృష్టానికి, సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఎక్కువగా కాలి, బొటనవేలుకు ధరిస్తారు.  అయితే గోరింటాకు ఎర్రగ పండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దల నమ్మకం. ఎర్రపండాలి అంటే కొన్ని చిట్కాలు సహాయపడుతాయి. 

2 /7

గోరింటాకు పెట్టుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన  డిజైన్‌ను వేసుకోవాలి. ఈ గోరింటాకును ఎనిమిది గంటలు పాటు ఉంచుకోవాలి. దీని తీసే ముందు ఎలాంటి సబ్బును ఉపయోగించకుండా మంచి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మెహందీ ఎర్రగా అందంగా  ఉంటుంది.

3 /7

నిమ్మకాయ, షుగర్‌ జ్యూస్‌  గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెండు మిశ్రమాలు  గోరింటాకును ఎర్రగా చేయడానికి సులభమైన మార్గం. గోరింటాకు ఎండిన తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకోవడం వల్ల చక్కటి ఎర్రపు రంగు మీ సొంతం అవుతుంది. 

4 /7

గోరింటాకు మంచి రంగులోకి రావడానికి లవంగం పొగ ఎంతో సహాయపడుతుంది. గోరింటాకు నిమ్మ, షుగర్‌ రాసిన తరువాత ఒక పాన్‌లో  లవంగాలను వేడి చేయాలి. లవంగాల నుంచి వచ్చే పొగతో చేతులను ఆవిరి చేయడం వల్ల  గోరింటాకు ఎర్రగా పండుతుంది.

5 /7

ఆవనూనె  రాసుకోవడం వల్ల గోరింటాకు రంగు ఎక్కువ కాలం ఉంటుంది. దీని  గోరింటాకు పెట్టుకొని  కొద్ది సేపటకి  ఈ మిశ్రమాని చేతికి రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎర్రటి రంగులో  గోరింటాకు తయారువుతుంది.

6 /7

గోరింటాకు పెట్టుకున్న తరువాత వాసెలిన్ రాసుకోవడం వల్ల చేతులు ఎరబడుదుతాయి. వాసెలిన్‌ గోరింటాకు ఆరిన తరువాత రాసుకోవడం వల్ల ఎర్రని చేతులు మీ సొంతం అవుతాయి. 

7 /7

చేతులు, కాళ్లను మెహందీని త్వరగా ఆరబెట్టడానికి బ్లో డ్రాయర్ల ఉపయోగించవద్దు. గోరింటాకు పెట్టుకునే ముందు ఎక్కువ నీరు లేదా రసం త్రాగ కూడదు. సబ్బు నీటితో చేతులను అసలు కడుక్కోవద్దు.