Wife Committed Suicide: బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన వెంకట లక్ష్మి అనే మహిళ అక్కడ ఓ షేక్ ఇంట్లో వెట్టిచాకిరి చేస్తూ అర్థాంతరంగా తనువు చాలించిన విషాధ ఘటన ఇది. కోనసీమ జిల్లా శివకోటి వెంకట లక్ష్మి స్వస్థలం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించే బతుకుదెరువు కోసం వెదుక్కుంటున్న వెంకట లక్ష్మిని మస్కట్ ఏజెంట్స్ మోసం చేశారు. బాగా డబ్బులు సంపాదించే ఉపాధి మార్గం చూపిస్తామని నమ్మబలికిన ఏజెంట్స్ ఆమెను మస్కట్ కి పంపించారు. ఏజెంట్స్ కి డబ్బులు చెల్లించి మరీ కోటి ఆశలతో మస్కట్ లో అడుగుపెట్టిన వెంకట లక్ష్మికి ఆ తరువాతే తెలిసింది అక్కడ తాను చేసేది పని కాదు.. వెట్టిచాకిరి అని.
విశ్రాంతి లేకుండా, సరైన తిండి, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తూనే తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట లక్ష్మికి మస్కట్ లో బతుకు భారమైంది. అక్కడి నుంచి బయటపడేంత డబ్బులు కూడా తన వద్ద లేవు. ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఆమెకు మార్గం కనిపించలేదు. తాను పడుతున్న కష్టాల గురించి, అనుభవిస్తున్న నరకయాతన గురించి శివకోటిలో ఉన్న భర్తకు ఫోన్ చేసి చెప్పుకుని బోరుమంది.
భార్య చెప్పినదంతా విని షాకైన భర్త.. తన భార్యకు మాయ మాటలు చెప్పి ఆమెను మస్కట్‌కి పంపించిన బ్రోకర్లను పట్టుకుని నిలదీశాడు. తమకేమీ తెలియదన్నట్టే సమాధానం ఇచ్చిన ఏజెంట్స్.. ఈసారి ఆమెను తిరిగి భారత్‌కి తీసుకురావాలంటే లక్షన్నర వరకు ఖర్చవుతుందని.. ఆ డబ్బులు ఇస్తే తాము పని చేసి పెడతామన్నారు. ఓవైపు వేధిస్తున్న అనారోగ్యం.. మరోవైపు ఏజెంట్స్‌కి ఇవ్వడానికి తమ వద్ద అంత డబ్బులు లేకపోవడంతో ఇక బతుకే భారంగా భావించిన వెంకట లక్ష్మి చివరకు తనకు చావే శరణ్యం అనుకుంది. చావుతో ఏమీ సాధించలేమని గ్రహించలేకపోయిన వెంకట లక్ష్మి.. భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read : Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ
Also Read : Honor Killing: ఏపీలో పరువు హత్య.. ఆ కులం కుర్రాడిని ప్రేమించిందని చంపి ఉరేశారు.. కానీ?
Also Read : Woman's Revenge Story: మరొకరిని చంపి అదే శవంతో సూసైడ్ స్కెచ్.. సినిమాను తలపించే రివేంజ్ డ్రామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook