బాలీ పరిస్థితిపై సుష్మా ఆరా..!

ఇండోనేషియాలోని బాలీ లో అగ్నిపర్వతం బద్దలవడంతో అక్కడి భారతీయుల పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరా తీశారు. అక్కడి భారతీయులను రక్షించేందుకు భారత ఎంబసీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.

Last Updated : Nov 28, 2017, 04:04 PM IST
బాలీ పరిస్థితిపై సుష్మా ఆరా..!

ఇండోనేషియాలోని బాలీ లో అగ్నిపర్వతం బద్దలవడంతో అక్కడి భారతీయుల పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరా తీశారు. అక్కడి భారతీయులను రక్షించేందుకు భారత ఎంబసీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. "బాలీ లో ఉన్న భారతీయులు భయపడవద్దు. జకార్తాలో మీకు సహాయపడేందుకు భారత రాయబారి ప్రదీప్ రావత్, కౌన్సిలర్ సునీల్  బాబు ఉన్నారు. నేను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటాను" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

బాలీలోని ఆగంగ్ అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. లావా ధాటికి చుట్టుప్రక్కల ప్రాంతాలలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అధికారులు స్థానికంగా నివసిస్తున్న గ్రామాలలో ప్రజలను ఖాళీ చేయించారు.  విమానరాకపోలను పూర్తిగా ఆపేసారు. మరో 24 గంటలపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని  ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. 

 

Trending News