పొట్టకూటి కోసం భారత్ నుంచి గల్ఫ్ దేశాల్లోకి వెళ్లి దుర్భర జీవితాలను అభువిస్తున్న ఘటనలు అనేకం. తాజాగా ఓ అలీ అనే భారతీయు 21 నెలల క్రితం ఉద్యోగం కోసం భారత్ నుంచి సౌదీకి వెళ్లాడు. అక్కడ ఉద్యోగం దొరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో రెండేళ్ల పాటు కాలం గడిపాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తిరిగి భారత్ రావాలనుకున్నాడు.
అతని వద్ద వీసా పత్రాలు కూడా లేకపోవడంతో తిరిగి రావడం ఇబ్బందికరంగా మారింది. గత 12 నెలల నుంచి నాకు సాయం చేయాల్సిందిగా భారత దౌత్య అధికారులను అభ్యర్థిస్తున్నాను. ఇప్పటి వరకు తన ఎలాంటి సాయం అందకపోవడంతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశారు.
సాయం కోసం తాను చేసిన ప్రయత్నాలు వివరిస్తూ గత బాధను పరిచిన ఆ వ్యక్తి... ‘ఒక్క విషయం చెప్పండి. నాకు సాయం చేస్తారా? ఆత్మహత్య చేసుకోమంటారా?’ అంటూ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అలీ చేసిన ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందించిన సుష్మా, ఆత్మహత్య ఆలోచనలు వద్దని వారించారు. మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. బాధితుడిని భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ అధికారులుకు సుష్మ ఆదేశాలు జారీ చేశారు
'Khud kusi' ki baat nahin sochte. Hum hain na. Hamari Embassy aapki poori madad karegi.
@IndianEmbRiyadh - Pls send me a report on this. https://t.co/ajU8EXyhAK— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 18, 2019