America Accident: అమెరికాలో రోడ్ టెర్రర్..ముగ్గురు ఎన్నారైల దుర్మరణం..!

America Accident: అమెరికాలో మరో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇందులో ముగ్గురు ఎన్నారైలు మృతి చెందారు. 

Written by - Alla Swamy | Last Updated : Sep 27, 2022, 01:35 PM IST
  • అమెరికాలో మరో ఘోర రోడ్డుప్రమాదం
  • ముగ్గురు ఎన్నారైల మృతి
  • పలువురి సంతాపం
America Accident: అమెరికాలో రోడ్ టెర్రర్..ముగ్గురు ఎన్నారైల దుర్మరణం..!

America Accident: అమెరికాలో రోడ్లు నెత్తురోడాయి. టాక్సాస్‌లోని వాలర్ కౌంటీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణి శ్రీ, ఇద్దరు కుమార్తెలు  మృత్యువాత పడ్డారు. శ్రీనివాస్‌ భార్య తమ కుమార్తెలను కళాశాల నుంచి తీసుకొస్తుండగా ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను ఢీకొట్టింది. స్పాట్‌లోనే ఇద్దరు చనిపోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

నాగేంద్ర శ్రీనివాస్ స్వస్థలం కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామం. ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికాకు వెళ్లారు. అక్కడే హ్యూస్టన్‌లో వైద్యుడిగా స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో కుమార్తె 11వ తరగతి చదువుతోంది. రోడ్డుప్రమాదంలో భార్యాపిల్లలు చనిపోవడంతో నాగేంద్ర శ్రీనివాస్‌ శోకసంద్రంలో ఉన్నారు.

ఆయన తండ్రి కొడాలి రామ్మోహన్‌రావు గతంలో ప్రభుత్వం ఉద్యోగం చేసి విజయవాడలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ భార్య, కుమార్తెల మృతి పట్ల తానా సభ్యులు సంతాపం తెలిపారు. రోడ్డుప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో నాగేంద్ర శ్రీనివాస్ స్వస్థలం కురుమద్దాలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరలంటూ ఆకాంక్షిస్తున్నారు. 

Also read:Rashmika Mandanna Hot Pics: రష్మిక మందన్న క్లీవేజ్ షో.. గాగ్రాలో గుబులు రేపుతోందిగా!

Also read:Chiru Support Jagan: జగన్ కు జై కొట్టిన చిరంజీవి, నాగార్జున.. టీడీపీలో కలవరమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News