Tata Nexon 2023: ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్‌యూవీ ఉండగా.. మారుతీ బ్రెజాను ఎందుకు కొనుగోలు చేయాలి!

Safest SUV is Tata Nexon 2023 Rival Maruti Brezza. గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP) టాటా నెక్సాన్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలకు భద్రత గురించి మరింత అవగాహన ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 14, 2023, 02:01 PM IST
  • ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్‌యూవీ
  • మారుతీ బ్రెజాను ఎందుకు కొనుగోలు చేయాలి
  • సేఫ్టీ రేటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ
Tata Nexon 2023: ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్‌యూవీ ఉండగా.. మారుతీ బ్రెజాను ఎందుకు కొనుగోలు చేయాలి!

Tata Nexon Safty Rating 2023: ప్రస్తుత రోజుల్లో కారు కొనుగోలు చేసేటప్పుడు ఎన్నో ప్రయోజనాలను చూస్తారు. ముఖ్యంగా కారు సేఫ్టీ రేటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలకు భద్రత గురించి మరింత అవగాహన ఉంది. ఈ క్రమంలోనే జనాలు ఇప్పుడు ఎక్కువగా ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కూడా సబ్-4 మీటర్ ఎస్‌యూవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సొనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాహనాలు సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది.

ఇక టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. అయితే సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే.. గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP) టాటా నెక్సాన్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అయితే కొత్త మారుతి బ్రెజా (2022లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్) ఇంకా క్రాష్ టెస్ట్ చేయబడలేదు కానీ.. పాత బ్రెజాకి 4 స్టార్ ఇవ్వబడింది. అంటే ఈ కారు స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. మారుతి బ్రెజా ధర రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్ ధర రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నెక్సాన్‌లో రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ఉంది. దీని ధర రూ. 12.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 5 సీట్ల ఎస్‌యూవీ. ఈ కారు బూట్ స్పేస్ 350 లీటర్లు. నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. దీని 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 120PS/170Nm అయితే.. 1.5-లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 115PS/260Nm పవర్ చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉన్నాయి.

టాటా నెక్సాన్ కారు Android Auto మరియు Apple CarPlay కనెక్టివిటీతో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.  రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, AC వెంట్‌లు, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Also Read: Ketu Gochar 2023: కేతు సంచారం 2023.. ఈ రాశుల వారికి అడుగడుగునా విజయమే! డబ్బు సంచులు పక్కా  

Also Read: Tamannaah Bhatia Bikini Pics: తమన్నా భాటియా బికినీ ట్రీట్.. మిల్కీ బ్యూటీది మామూలు అందం కాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News