Budh Purnima Effect 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య రెండూ వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అంటారు. ఈరోజునే బుద్ధుడు జన్మించాడని నమ్ముతారు. ఆస్ట్రాలజీలో బుద్ధ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అదే రోజున ఏర్పడుతుంది.
బుద్ధ పూర్ణిమ మే 5న జరుపుకుంటారు మరియు అదే రోజున చంద్రగ్రహణం కూడా సంభవించబోతుంది. ఈ మహా యాదృచ్చికం 130 ఏళ్ల తర్వాత జరగటం ఇదే తొలిసారి. ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8.47 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
మేషరాశి
బుద్ధ పూర్ణిమ మేషరాశి వారికి కలిసి వస్తుంది. ఈరోజున సూర్యుడు మేషరాశిలో మాత్రమే కూర్చుంటాడు. అలాగే బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై స్పెషల్ గా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Surya Grahan 2023: ఏప్రిల్ 20 నుంచి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే?
కర్కాటక రాశి
మే 5న ఏర్పడబోతున్న చంద్రగ్రహణం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు మరియు బుధుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం వీరికి లక్ ను ఇస్తుంది. కర్కాటక రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి బుద్ధ పూర్ణిమ రోజు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఈ రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈరాశి వారు ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశంఉంది.
Also Read: Mesh Sankranti 2023: రేపు మేషరాశిలోకి సూర్యుడు... ఈ 5 రాశులకు లాభాలు బోలెడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి