Mangal Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహం అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో కుజుడు బలమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. అంతేకాకుండా మీ జీవితంలోని అన్ని సమస్యలు తీరుతాయి. మే నెలలో కుజుడు మిథున రాశి నుండి బయటకు వెళ్లి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో అంగారకుడు 82 రోజులపాటు ఉంటాడు. అనంతరం మార్స్ సింహరాశిలోకి ప్రవేశిస్తాుడు. ఈ సంచార సమయంలో కొన్ని రాశులవారు ఆర్థిక మరియు వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోంటారు. అంగారక గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి గరిష్ట ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కుజుడు సంచారం ఈ రాశులకు వరం
వృషభం
కుజుడు సంచారం వల్ల వృషభ రాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకే మేలు జరుగుతుంది.
కన్య రాశి
అంగారక సంచారం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనుస్సు రాశి
మార్స్ గోచారం ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీనరాశి
మే నెలలో కుజుడు రాశి మార్పు శుభ ప్రభావం మీనరాశి వారిపై కూడా ఉంటుంది. మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
Also Read: Mercury transit 2023: వచ్చే 2 నెలలపాటు ఈ 5 రాశులకు అదృష్టం, వద్దన్నా డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook