CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!

State Bank of India: కాగ్ మరో సంచలన రిపోర్ట్ బయపెట్టింది. ఎస్‌బీఐ అడగకుండానే డీఎఫ్‌సీ రూ.8,800 అప్పుగా ఇచ్చిందని పేర్కొంది. ఎస్‌బీఐలో క్రెడిట్ గ్రోత్ కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అయితే డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం అవసరాలను అంచనా వేయలేదని వెల్లడించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 10:08 AM IST
CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!

State Bank of India: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFC) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అడగకుండానే రూ.8,800 కోట్లు ఇచ్చింది. పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో దేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ సమాచారాన్ని వెల్లడించింది. మార్చి 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమ్మతి ఆడిట్ నివేదికలో డిపార్ట్‌మెంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్‌కు ముందు.. నిబంధనల ప్రకారం మూలధన అవసరాన్ని అంచనా వేయలేదని కాగ్ పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ అడకపోయినా.. డీఎఫ్‌సీ అప్పుగా ఇచ్చిందని వెల్లడించింది. ఈ మూలధనం క్యాపిటలైజేషన్ వ్యాయామం రూపంలో చెల్లించిందని తెలిపింది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఈ విభాగం తరపున డీఎఫ్‌సీ తరపున.. ఎస్‌బీఐలో క్రెడిట్ గ్రోత్ కోసం 8,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే క్యాపిటలైజేషన్‌కు ముందు ఎటువంటి సమీక్ష జరగలేదు. బ్యాంక్ నుంచి కూడా అప్పు కోసం ఎలాంటి ప్రతిపాదించలేదు. రుణాన్ని పెంచే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని ఎస్‌బీఐలో పెట్టుబడి పెట్టినట్లు కాగ్ వెల్లడించింది. కానీ మూలధనాన్ని నింపడానికి ముందు డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం అవసరాలను అంచనా వేయలేదని వెల్లడించింది.

కాగ్ నివేదిక ప్రకారం.. పీఎస్‌బీలను క్యాపిటలైజ్ చేస్తున్నప్పుడు.. ఆర్థిక సేవల విభాగం ఆర్‌బీఐ నియమాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుంది. ఆర్‌బీఐ ఇప్పటికే భారత్‌లోని బ్యాంకులపై అదనంగా ఒక శాతం పెంచిన మూలధన అవసరాన్ని ఏర్పాటు చేసిందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అదనంగా రూ.7,785.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.831 కోట్లు డిపాజిట్ చేసింది. 

అయితే ఈ బ్యాంక్ రూ.798 కోట్లు డిమాండ్ చేయగా.. రూ.33 కోట్లు అదనంగా డిపాజిట్ చేసింది. బ్యాంకుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి ఫండ్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ వృద్ధితో సహా అనేక విషయాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. మూల్యాంకనం ఆధారంగా నిధులను విడుదల చేస్తుంది.

Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!  

Also Read: Aha New CEO: ఆహా కీలక నిర్ణయం.. కొత్త సీఈఓ నియామకం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News