Jio plans for ipl 2023: అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం, నెలకు 198 రూపాయలే

Jio plans for ipl 2023: టెలీకం రంగంలో రెండు ప్రధాన పోటీదారులు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఆఫర్ల విషయంలో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఐపీఎల్ 2023 దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఛీఫ్ అండ్ బెస్ట్ ప్లాన్ విడుదల చేసింది రిలయన్స్ జియో. ఆ ప్లాన్ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 08:10 AM IST
Jio plans for ipl 2023: అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం, నెలకు 198 రూపాయలే

Jio plans for ipl 2023: ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో పోటీ ఎదుర్కొంటూ రిలయన్స్ జియో కొత్తగా 198 రూపాయల ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ పేరు బ్రాడ్‌బ్యాండ్ బ్యాక్‌అప్ ప్లాన్. ఇందులో గరిష్టవేగం 10 ఎంబీపీఎస్ ఉంటుంది. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ విభాగంలో చాలా ప్లాన్స్ అందిస్తోంది. దీంతో పాటు ఫైబర్‌లో కూడా కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు ఐపీఎల్ 2023 ప్రారంభ సమయంలో కొత్త ప్లాన్ పరిచయం చేస్తోంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో స్థిరంగా ఉండేందుకు 198 రూపాయల ప్లాన్ అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ బ్యాక్‌అప్ ప్లాన్‌గా పిల్చుకునే ఇందులో గరిష్టంగా 10 ఎంబీపీఎస్ వేగం ఉంటుంది.

ఇప్పటి వరకూ జియో ఫైబర్ కనెక్షన్ కావాలంటే కనీ ప్లాన్ 399 రూపాయలుండేది. కస్టమర్లు ప్రతి క్షణం కనెక్ట్ అయి ఉండే అవసరాన్నిఅర్ధం చేసుకుని..జియో ఫైబర్ బ్యాకప్ కోసం ఈ కొత్త ప్లాన్ అందిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. కస్టమర్లకు ఇంటర్నెట్ వేగం 30 ఎంబీపీఎస్ లేదా 100 ఎంబీపీఎస్ చేసే ఆలోచన కూడా ఉంది. వారం రోజుల ఈ సౌకర్యం కోసం కస్టమర్లకు 21 నుంచి 152 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ టారిఫ్ 1490 రూపాయలు. ఇందులో 500 రూపాయలు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుంటాయి. అంటే మిగిలిన 999 రూపాయలు ప్లాన్ టారిఫ్ కానుంది. అంటే నెలకు ఈ ప్లాన్ 198 రూపాయలు పడుతుంది. ఈ ప్లాన్ 5 నెలల కాల పరిమితితో ఉంటుంది. 

ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ కాకుండా మొబైల్ రీఛార్జ్ టారిఫ్ లు కూడా విభిన్న రకాలుగా అందిస్తోంది. ఇందులో కొన్ని ప్లాన్స్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ రంగంలో పోటీగా ఉన్న ఎయిర్‌టెల్‌కు దీటుగా ఎప్పటికప్పుడు జియో ప్లాన్స్ అప్‌డేట్ చేస్తోంది. 

Also read: Hyundai Sonata Facelift Launch: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లుక్, ఫీచర్స్ అదుర్స్! లగ్జరీ కార్లకు ధీటుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News