Guru Chandal Yog Effect: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి అదృష్టాన్ని ఇచ్చే గ్రహంగా భావిస్తారు. అయితే రాహువును ఛాయా లేదా దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. రాహువు ఇప్పటికే మేషరాశిలో కూర్చుని ఉన్నాడు. మేషరాశిలో రాహువు మరియు గురు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ గురు రాహువు యెుక్క కూటమి 5 రాశులవారి జీవితాల్లో కల్లోలం సృష్టించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులవారు జాగ్రత్త
మేషరాశి: మేషరాశిలోనే రాహువు, గురుగ్రహ కలయికతో గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది మేషరాశి వారికి అననుకూలంగా ఉంటుంది. మీకు పనుల్లో అపజయం ఎదురవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది.
మిథునం: గురు చండాల యోగం వల్ల మిథున రాశి వారికి డబ్బు, ఆరోగ్యం విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కెరీర్లో కూడా సమస్యలు రావచ్చు. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. ఆఫీసులో సహచరులతో విభేదాలు రావచ్చు.
కన్య: గురు చండాల యోగం వల్ల కన్యా రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కెరీర్లో సమస్యలు రావచ్చు.
ధనుస్సు : గురు చండాల యోగం కారణంగా ధనుస్సు రాశి వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. యాక్సిడెంట్ కూడా జరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి.
మకరం: మకర రాశి వారికి గురు చండాల యోగం జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇంట్లో గొడవలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.
Also Read: Venus Transit 2023: త్వరలో వృషభ రాశి ప్రవేశం చేయనున్న శుక్రుడు.. ఈ 4 రాశులవారిపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook