7th Pay Commission Latest Update: డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటన శుక్రవారమే వస్తుందని అందరూ అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే డీఏ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డీఏ పెంపు కోసం 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ దఫా కూడా నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం ఉందని నిఫుణులు అంచనా వేస్తున్నారు.
ఏడవ వేతన సంఘం సిఫార్సు అమలు చేసినప్పుడు.. ఆరవ వేతన సంఘం కనీస వేతనంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ 14.3 శాతం పెరిగింది. అంతకుముందు ఆరవ వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు.. ఐదవ వేతన సంఘంతో పోలిస్తే మూలవేతనంలో 54 శాతం పెరుగుదల ఉంది. ఐదవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనంలో 31 శాతం జీతం పెరిగింది. ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడారు. 2014 నుంచి కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన వివిధ పన్ను ప్రయోజనాల చర్యల వివరాలను ఆయన పార్లమెంట్లో వెల్లడించారు.
'ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేసే పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచాం. ఫైనాన్స్ యాక్ట్ 2017 ప్రకారం.. మొత్తం ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను పరిమితి 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాం. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెరిగింది. ఇది పన్ను చెల్లింపుదారుల వేతన తరగతి, పెన్షనర్లు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చింది..' అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఫైనాన్స్ యాక్ట్ 2019లోని సెక్షన్ 87ఏ కింద రూ.5 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ నుంచి మినహాయించిన విషయాన్ని గుర్తు చేశారు. పెన్షన్ తీసుకునే సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించడానికి ఆర్థిక చట్టం 2018లో వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉదాహరణకు 80డీ కింద హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంపై మినహాయింపు పరిమితిని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచినట్లు చెప్పారు. అదేవిధంగా తీవ్ర వ్యాధులకు వైద్య ఖర్చులను లక్ష రూపాయలకు పెంచామన్నారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై రూ.50 వేల వరకు వడ్డీపై పన్ను మినహాయింపు ఉందని ఆయన వెల్లడించారు.
Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ
Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook