Mars Transit 2023 in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం 9 గ్రహాలు తమ రాశులను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. ఈ గ్రహ సంచారాలు మరియు రాశి మార్పులు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. నిన్న అంటే మార్చి 13న కుజుడు తన రాశిని మార్చుకుని మిథునరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడు మే 10 వరకు మిథునరాశిలోనే సంచరిస్తాడు. ధైర్యాన్ని, శౌర్యాన్ని, వివాహాన్ని మరియు భూమిని ఇచ్చే అంగారకుడు రాబోయే 2 నెలలు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగించవచ్చు. ఈరాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశుల వారు రాబోయే 2 నెలలు జాగ్రత్త
వృషభం (Taurus): కుజుడు సంచారం వల్ల వృషభ రాశి వారికి కుటుంబ కలహాలు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మొండితనం మరియు కోపం మానుకోండి. మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి.
కర్కాటకం (Cancer): అంగారకుడి మిథునరాశి ప్రవేశం వల్ల కర్కాటక రాశి వారికి ఖర్చులు, పనిభారం పెరుగుతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఈ సమయంలో సహనంగా ఉండండి.
వృశ్చికం (Scorpio): మార్స్ గ్రహ సంచారం ఈ రాశి వారి లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులను కలిగిస్తుంది. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కుట్ర జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.
మీనం (Pisces): అంగారక సంచారం మీకు ఊహించని ఫలితాలను ఇస్తుంది. ప్రయాణాల్లో మీ లగేజీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కలహాలు ఒత్తిడిని కలిగిస్తాయి. శత్రువులతో అప్రమత్తంగా మెలగండి.
అంగారక శాంతి కోసం పరిహారాలు
- అంగారకుడి యొక్క అననుకూల ప్రభావాలను నివారించడానికి.. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించండి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పఠించండి. రోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచిది.
- మంగళవారం నాడు హనుమాన్ ఎరుపు రంగు బట్టలు మరియు కుంకుమ పెట్టండి. అంతేకాకుండా సుందరకాండను కూడా పఠించండి.
- ప్రతి మంగళవారం హనుమాన్ యెుక్క బీజ మంత్రమైన 'ఓం హనుమతే నమః' 108 సార్లు జపించడం వల్ల అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
Also Read: Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల దశ తిరగబోతుంది...ఇక వీరికి డబ్బే డబ్బు.. ఇందులో మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook