Chandra Grahan 2023: ఈ ఏడాది ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఎన్ని గంటలు ఉంటుందో తెలుసా?

Chandra Grahan 2023:  ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. 2023లో ఏర్పడబోయే మొదటి చంద్రగ్రహణం దాదాపు 4 గంటల 15 నిమిషాల పాటు ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 03:45 PM IST
Chandra Grahan 2023: ఈ ఏడాది ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఎన్ని గంటలు ఉంటుందో తెలుసా?

Chandra Grahan 2023:  ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8:45 గంటలకు ఏర్పడనుంది. ఇది అర్ధరాత్రి 1:00 గంట వరకు ఉండనుంది. ఈ గ్రహణ మొత్తం సమయం 4 గంటల 15 నిమిషాలు. ఈ చంద్రగ్రహణంలో సూతక్ కాలం చెల్లదు, ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశం నుండి కనిపించదు. సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడుతుంది.

ఈ ఏడాది ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి?
2023లో రెండు సూర్య గ్రహణాలు మరియు రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ సంవత్సరం రెండు సూర్యగ్రహణాలు ఏప్రిల్ 20 మరియు అక్టోబర్ 14న సంభవిస్తాయి. అయితే ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపించవు. అయితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ శనివారం నాడు ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవల్సిన అవసరం ఉంది. 

సూతక కాలం చెల్లుతుందాం?
సాధారణంగా సూతక కాలం చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది. అదే సూర్యగ్రహణం అయితే సూతకం 12 గంటల ముందు మెుదలవుతుంది. ఈ సమయంలో ఏదైనా తినడం, త్రాగడం లేదా పూజించడం నిషేధం. అంతేకాకుండా ఈ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. 

రెండోది ఎప్పుడు?
అక్టోబర్ నెలలో సంభవించే చంద్రగ్రహణం ఖండగ్రాస్. ఇది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమి నాడు అశ్వినీ నక్షత్రంలో ఏర్పడుతుంది. ఇది భారత్‌తో పాటు ఆసియా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, అమెరికా తూర్పు భాగం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. 

Also Read: Surya Gochar 2023: ఆదిత్యుడి మీనరాశి ప్రవేశం.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News