Chandra Grahan 2023: ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు జరగబోతున్నాయి, అందులో 2 సూర్య గ్రహణాలు మరియు 2 చంద్ర గ్రహణాలు ఉంటాయి. చాలా మంది గ్రహణం చూడకూడదని, మంచిది కాదని రకరకాలుగా చెబుతుంటారు. 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవించనుంది, ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఎప్పుడంటే..
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5, శుక్రవారం రాత్రి 8.45 గంటలకు ఏర్పడనుంది. ఇదే రోజు వైశాఖ పూర్ణిమ కూడా వస్తుంది. దీనినే బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ గ్రహణం 4 గంటల 15 నిమిషాలుపాటు ఉంటుంది. ఇప్పుడు ఏర్పడబోయేది ఛాయా చంద్రగ్రహణం.
సూతక్ కాలం ఉందా లేదా?
ఈ సంవత్సరం సంభవించే చంద్రగ్రహణంలో సూతక్ కాలం చెల్లదు ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశం నుండి కనిపించదు. హిందూ గ్రంథాల ప్రకారం, గ్రహణం సంభవించినప్పుడు రాహువు మరియు కేతువుల నీడ రాశిచక్ర గుర్తులపై ప్రసరిస్తుంది. దీని కారణంగా సూతక్ కాలం అనుసరిస్తారు. అంతేకాకుండా ఈ సూతక్ కాల సమయంలో దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలు మూసివేయబడతాయి. ఈ సమయంలో తినడం, పడుకోవడం వంటివి కూడా నిషేధం.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది..
ఈ చంద్రగ్రహణాన్ని హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, అట్లాంటిక్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మరియు పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా మరియు పసిఫిక్ మహాసముద్రం నుండి చూడవచ్చు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.
రెండో చంద్రగ్రహణం ఎప్పుడు?
2023లో రెండవ చంద్రగ్రహణం అక్టోబర్ 28న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో చివరి గ్రహణం అవుతుంది. ఈ గ్రహణాన్ని యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు అమెరికా మరియు ఆఫ్రికా నుండి చూడవచ్చు.
Also Read: Guru Shukra yuti 2023: మరో 2 రోజుల్లో హోలీ.. ఈ 4 రాశులకు అన్ లిమిటెడ్ మనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook