PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లోకి రాలేదా..? ఈ నంబర్లకు కాల్ చేయండి

PM Kisan Yojana Helpline Number: మీ ఖాతాలో పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు జమ కాలేదా..? మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఈమెయిల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 05:49 PM IST
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లోకి రాలేదా..? ఈ నంబర్లకు కాల్ చేయండి

PM Kisan Yojana Helpline Number: పీఎం కిసాన్ యోజన 13వ విడతకు సంబంధించిన నిధులను ఇటీవలె కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు జమకాలేదు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాలకు రూ.16,400 కోట్లు బదలాయించారు. నిధులు విడుదల చేసి ఐదు రోజులైనా తమ ఖాతాలో నగదు జమకాకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే డబ్బు జమకాని దిగులు చెందాల్సిన పనిలేదు. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన ఏదైనా సమస్య కోసం.. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఈమెయిల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. 
 
దేశంలో రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 3 వాయిదాల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అందజేస్తోంది. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తోంది. అయితే ఈ నగదును రూ.8 వేలకు పెంచుతుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగినా.. అదంతా ఫేక్ అని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇటీవల 13వ విడత నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయి.

మీకు ఖాతాలో డబ్బు జమ అయిందో లేదో ఇలా తెలుసుకోండి..
 
==> పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కి వెళ్లాలి.
==> ఆ తరువాత 'ఫార్మర్స్ కార్నర్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ మీ నుంచి కొన్ని వివరాలు అడుగుతారు. మీరు వాటిని ఫిల్ చేయండి.
==> తరువాత 'గెట్ డేటా'పై క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి వస్తుంది.
==> మీరు మీ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.  

మీరు కూడా లబ్ధిదారులై ఉండి.. ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు మీ ఖాతాలోకి రాకపోతే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించవచ్చు – 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లకు కాల్ చేయండి. మీరు ఈ-మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మీ ఫిర్యాదును pmkisan-ict@gov.in కు మెయిల్ చేసి సమస్యను పరిష్కరించుకోండి.

Also Read: Ind Vs Aus: ఆసీస్‌ టీమ్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి టెస్టుకు కెప్టెన్ కమిన్స్ దూరం 

Also Read: MLA Etela Rajender: నిమ్మకునీరు ఎత్తినట్లు కేసీఆర్ తీరు.. ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య: ఈటల రాజేందర్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News