Balagam Director Venu Clarity on Copy Allegations: జై సినిమాతో కమెడియన్గా లాంచ్ అయ్యి తర్వాత అనేక సినిమాల్లో కమెడియన్ గా నటించిన వేణు జబర్దస్త్ ద్వారా జబర్దస్త్ వేణుగా మారిపోయాడు. జబర్దస్త్ లో అనేక సంవత్సరాలు కమెడియన్గా వ్యవహరించిన ఆయన సినిమాలు కూడా తగ్గించేశాడు. అడపాదడపా మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఆయన అనూహ్యంగా బలగం అనే సినిమాతో దర్శకుడిగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా తెరకెక్కించిన ఆయన ఆ సినిమాతో అందరి మనసులను దోచేశాడు.
దిల్ రాజు కుమార్తె నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ప్రారంభమైన కొత్త నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమా నిర్మితమైంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్, వేణు ఎల్దండి, రోహిణి, రచ్చ రవి వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజే ఆసక్తికరంగా 50 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా చిన్న సినిమాల్లో ఒక ట్రెండు సృష్టించినట్టే అంటున్నారు.
అయితే ఈ కథ తనది అని, పచ్చికి అనే ఒక కథ రాయగా దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు అంటూ తెలంగాణలో ఒక జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చారు. గడ్డం సతీష్ అనే ఆయన తాను రాసిన పచ్చికి అనే కథను ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించారని తన కధను సినిమాగా తీసుకున్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇలా క్రియేటివిటీని దొంగలించకూడదు అడిగి తీసుకోవాలి అంటూ కామెంట్లు చేశారు. దిల్ రాజు ఈ విషయంలో స్పందించకపోతే తాను లీగల్ గా ముందుకు వెళతానని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
దర్శకుడుగా తాను చేసిన బలగం సినిమా మీద వస్తున్న ఆరోపణల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక కథ కాదని తెలంగాణ సంప్రదాయం అని పిట్ట ముట్టకపోవడం అనేది తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా చోట్ల ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకటవ రోజు మూడవ రోజు ఐదవ రోజు 11వ రోజు ఇలా పిండాలు పెట్టడం తర్వాత కాకి ముట్టుకునే వరకు ఎదురుచూడడం లాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని అన్నారు.
అలాగే తన కుటుంబంలో తన తాతయ్య తన పెద్దమ్మ చనిపోయినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్న ఇలాంటి విషయాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించాను అని చెప్పుకొచ్చాడు. జాతి రత్నాలు సినిమా చేయకంటే ముందే అనుదీప్ తనకు స్నేహితుడని అనుదీప్తోనే కలిసి తాను పది పదిహేను గ్రామాలు ఈ సినిమా విషయం మీద రెక్కీ చేసామని అక్కడి ఊరి పెద్దలకు మందు పోయించి అక్కడి చావులు ఎలా ఉండేవి? ఎలాంటి పరిణామాలు జరిగేవి లాంటి విషయాలను తెలుసుకునే వాళ్ళమని ఆయన అన్నారు. గడ్డం సతీష్ ఆరోపణలు పూర్తిగా వినలేదు కానీ అసలు ఆయనది అర్థం లేని ఆరోపణ అనే విధంగా వేణు కౌంటర్ ఇచ్చారు. చూడాలి గడ్డం సతీష్ ఎలా స్పందిస్తాడనేది.
Also Read: Supritha Photos: పొట్టి బట్టల్లో సురేఖా వాణి కూతురు రచ్చ.. హీరోయిన్లను మించిన హాట్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి