Shani Dev Favorite Zodiac Signs: మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శని. అందుకే ఆయనను న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలోకెల్లా స్లోగా కదిలే ఫ్లానెట్ శని. సాధారణంగా శని ఒకరాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శనిదేవుడు అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనివక్ర దృష్టి పడితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారుతాడు. ఆస్ట్రాలజీలో శనిదేవుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
శనిదేవుడికి ఇష్టమైన రాశులివే...
శనిదేవుడికి మకరం, కుంభం మరియు తుల రాశులంటే చాలా ఇష్టం. అయితే మీనం, ధనస్సు రాశులపై కూడా శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మకర, కుంభరాశులకు శనిదేవుడు అధిపతి. మీన, ధనస్సు రాశులు శనిదేవుడి స్నేహితుడి అయిన బృహస్పతి రాశులు.
తులరాశి (Libra): శనిదేవుడికి ఫేవరెట్ రాశుల్లో తుల రాశి ఒకటి. ఈ రాశిలో అతడు ఉన్నతంగా ఉంటాడు. వీరిపై శనిదేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు అన్ని రకాల సుఖాలను ఇస్తాడు.
మకర రాశి (Capricorn): ఈరాశి శనిదేవుడికి చాలా ప్రియమైనది. మకర రాశికి అధిపతి శనిదేవుడు. అందుకే వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ప్రతి కోరిక నెరవేరుతుంది.
కుంభరాశి (Aquarius): శనిదేవుడే కుంభ రాశికి కూడా అధిపతి. శని ప్రత్యేక అనుగ్రహంతో కుంభ రాశి వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఈ వ్యక్తులు తక్కువ శ్రమతో కూడా విజయం సాధిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read; Shatru Grah Yuti 2023: మార్చి 15 వరకు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.