RBI Imposed Restriction on Two Banks: బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలోని ఉర్వకొండ సహకారి మున్సిపల్ బ్యాంక్, మహారాష్ట్రలోని శంకర్‌రావ్ మోహితే పాటిల్ సహకరి బ్యాంక్‌లపై ఆంక్షలు విధించింది. ఇక నుంచి ఈ బ్యాంక్‌ల కస్టమర్లు తమ ఖాతా నుంచి రూ.5 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుంటున్న విషయం తెలిసిందే.
బ్యాంక్‌లపై విధించిన నిషేధం ఫిబ్రవరి 24 నుంచి రాబోయే 6 నెలల వరకు అమలులో ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆ తరువాత బ్యాంకింగ్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఆర్‌బీఐ కూడా ఈ బ్యాంకులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఈ నిషేధం ప్రకారం.. ఈ బ్యాంకులు ఎక్కడా పెట్టుబడి పెట్టలేవు. అలాగే ఏ వ్యక్తికి, కంపెనీకి లేదా సంస్థకు లోన్ కూడా ఇవ్వలేవు. ఈ నిషేధాన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దుగా పరిగణించరాదని ఆర్‌బీఐ తెలిపింది.
ఈ రెండు బ్యాంకులు ప్రస్తుతం ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్‌లకు డబ్బు కొరత ఏర్పడిందని పేర్కొంది. అందుకే నిషేధం విధించామని వెల్లడించింది. బ్యాంకు ఆర్థిక స్థితి మెరుగుపడేంత వరకు పరిమితులతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని చెప్పింది. నిబంధనలు సక్రమంగా పాటిస్తే.. మళ్లీ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ ప్రకారం.. డీఐసీజీసీ చట్టం (సవరణ) 2021లోని సెక్షన్ 18ఏ నిబంధనల ప్రకారం.. అర్హతగల డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
Also Read: TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్
Also Read: Bandi Sanjay: కేసీఆర్ వలలో పడి మోసం చేస్తారు.. వారితో జాగ్రత్త: బండి సంజయ్ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి