Saturn Rise: శనిదేవుడి రైజింగ్ తో ఈరాశులకు అదృష్టం పట్టనుంది... ఇందులో మీరున్నారా?

Shani Uday 2023: గ్రహాల గమనంలో మార్పు మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. శనిదేవుడి ఉదయం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 12:15 PM IST
Saturn Rise: శనిదేవుడి రైజింగ్ తో ఈరాశులకు అదృష్టం పట్టనుంది... ఇందులో మీరున్నారా?

Shani Uday 2023 Effect: మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఇతడి స్థానంలో చిన్నమార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం అస్తమయంలో ఉన్న శని.. వచ్చే నెల 5న ఉదయించబోతున్నాడు. గ్రహాల అస్తమయం ఎప్పుడూ శుభఫలితాలను ఇవ్వదు. కుంభంలో శనిదేవుడు ఉదయం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈ శనిదేవుడి యెుక్క ఉదయం ఏరాశులవారిపై తీవ్ర ప్రభావం చూపనుందో తెలుసుకుందాం. 

మేషం (Aries)- శనిదేవుడి రైజింగ్ వల్ల ఈరాశివారు కెరీర్‌లో ముందుకు వెళతారు. ఆర్థిక ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ పురోగతికి తలుపులు తెరవబడతాయి. 
వృషభం (Taurus)- ఈరాశివారు పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడపవల్సి వస్తుంది. మీ ప్రణాళికలు ఫలించడానికి సమయం పడుతుంది. అయినా సరే ప్రయత్నాన్ని విడనాడకండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి. 
మిథునరాశి (Gemini)- మిధున రాశి వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి. వ్యాపారవేత్తలకు బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. 
కన్య రాశి (Virgo)- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. 
తుల (Libra)- తుల రాశి విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పరిశోధన రంగంలో నిమగ్నమైన వారు మంచి ఫలితాలను సాధిస్తారు. గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మకరం (Capricorn)- ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తులు భారీగా సంపాదిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అయితే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కుంభం (Aquarius)- ఈ రాశి వారు తమ అహంకారాన్ని వీడనాడాలి. వ్యాపారుల ప్రణాళికలు ఫలించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

Also Read: Guru Gochar 2023: మీనంలో శుభ గ్రహాల కలయిక... ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News