7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు కీలకం.. డీఏ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం

7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రానుందా..? డీఏ పెంపుపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోబుతుంది..? 4 శాతం డీఏ పెంచితే ఉద్యోగుల ఖాతాలో ఎంత శాలరీ జమ అవుతుంది..? పూర్తి వివరాలు ఇవిగో..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 02:27 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు కీలకం.. డీఏ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం

7th Pay Commission Latest News: ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో డీఏ పెంచే అవకాశం ఉండగా.. జనవరి నెల నుంచి అమలుకానుంది. హోలీకి ముందే ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. మార్చి 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మార్చి జీతంలో బకాయిలతో పాటు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్‌ జమకానుంది. డిసెంబరు వరకు రిలీజ్ అయిన ఏఐసీపీఐ ఇండెక్స్‌ గణాంకాలను పరిశీలిస్తే.. ఈసారి 4 శాతం డీఏ పెరుగుతుందని స్పష్టమైంది.

4 శాతం పెంచితే.. ఉద్యోగుల జీతాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతం ఉండగా.. నాలుగు శాతం పెంచితే.. అది 42 శాతానికి చేరుకుంటుంది. జనవరిలో పెరిగిన ఏఐసీపీఐ ఇండెక్స్‌ ఆధారంగా కొత్త డీఏను గణిస్తారు. ఈసారి అందులో మంచి వృద్ధి కనిపిస్తుండడంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్‌ అత్యధిక సంఖ్య 132.5 పాయింట్ల వద్ద ఉంది. దీంతో డీఏలో 4 శాతం పెంపును నిర్ణయించినట్లు భావిస్తున్నారు.

కనీస ప్రాథమిక వేతనంపై లెక్కింపు ఇలా..

==> ఉద్యోగి బేసిక్ శాలరీ–రూ.18,000
==> కొత్త డీఏ (42 శాతం)– నెలకు రూ.7,560
==> ఇప్పటివరకు ఉన్న డీఏ (38%)– నెలకు రూ.6,840
==> ఎంత డీఏ పెరనుంది- నెలకు రూ.720
==> వార్షిక జీతంలో పెంపు -720X12= రూ.8,640

గరిష్ట జీతం స్థాయిలో ఇలా..

==> ఉద్యోగి బేసిక్ శాలరీ-రూ.56,900
==> కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (42 శాతం)-రూ.23,898
==> ఇప్పటివరకు డియర్‌నెస్ అలవెన్స్ (38 శాతం)-నెలకు రూ.21,622
==> ఎంత డీఏ పెరగనుంది-నెలకు రూ.2276
==> వార్షిక జీతంలో పెంపు -రూ.2276X12=రూ.27312

Also Read: TDP Vs Janasena: ఆ నియోజకవర్గంలో టీడీపీకి జనసేన చెక్.. ప్లాన్ రివర్స్..?  

Also Read: Marburg Virus: కలకలం రేపుతున్న కొత్త వైరస్.. వ్యాధి లక్షణాలు ఇవే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x