Copy Allegations on Writer Padmabhushan Movie: చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకుంది రైటర్ పద్మభూషణ్ సినిమా. సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజు, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలలో రూపొందించిన ఈ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుహాస్ తండ్రి పాత్రలో ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో రోహిణి మొల్లేటి నటించిన ఈ సినిమాకి ప్రేక్షక లోకం నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన లభిస్తోంది.
అయితే ఈ సినిమా కథ ఆసక్తికరంగా సాగడమే కాకుండా ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఫైట్లు డాన్సులు అంటూ ఏవేవో కమర్షియల్ హంగులు ఇరికించకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మీద కాపీ మరక పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా హిందీలో విడుదలై ఓ మాదిరిగా హిట్టు అందుకున్న సినిమా లాగానే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ కథలో కొన్ని పాయింట్లు బైరెల్లి కీ బర్ఫీ అనే ఒక సినిమాలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అంతే కాదు ఈ సినిమా హక్కులను ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసిందని, తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేసే హక్కులను కొనుగోలు చేసిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాను పోలి ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కడంతో ఎలా అలా తెరకెక్కించారు అంటూ నిర్మాణ సంస్థ ఇప్పుడు లీగల్ గా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కృతి సనన్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన ఈ సినిమాలో కూడా పుస్తకం రాసింది ఒక వ్యక్తి అయితే రాసింది తానేనని మరో వ్యక్తి ప్రచారం చేసుకుంటూ ఉంటాడు, పుస్తకం రాసిన వ్యక్తితో ప్రేమలో పడిన హీరోయిన్ చివరికి ఏమవుతుంది అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు అదే సినిమాని పోలివున్న రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ హిందీ సినిమా హక్కులు కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అని..
Also Read: Ram Charan New Party: జనసేనకు షాక్.. కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామ్ చరణ్?
Also Read: Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?