Fruits for Skin: మనం తీసుకునే ఆహార పదార్ధాల ప్రభావం ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంటుంది. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల చర్మం పాడవుతుుంది. ఆయిల్, మసాలా పదార్ధాలు అతిగా తీసుకుంటే పింపుల్స్, ముడతలు వంటి చర్మ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే..కొన్ని రకాల ఫ్రూట్స్‌ను డైట్‌లో భాగం చేసుకోవాలి. ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాలు మీ ముఖంపై ముడతల్ని మాయం చేస్తాయి. ఎప్పటికీ యౌవనంగా ఉండేట్టు చేస్తాయి.
స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ తినడం వల్ల చర్మానికి చాలా ఉపయోగం. ఇందులో యాంటీ ఏజీయింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు దూరమౌతాయి.
బొప్పాయి బొప్పాయి చర్మం కోసం చాలా ప్రయోజనకరం. వివిధ రకాల ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. బొప్పాయి తినడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంటుంది. చర్మంలో ముడతలు, పింపుల్స్ వంటి సమస్యలు పోతాయి.
ఆరెంజ్ ఆరెంజ్‌లో ఉండే పోషక గుణాలు చర్మానికి చాలా లాభం చేకూరుస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. యాంటీ ఏజీయింగ్ పని చేస్తాయి. చర్మాన్ని సంరక్షించి..యౌవనంగా ఉంచుతాయి.
నేరేడు నేరేడులో ఉండే పోషక గుణాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. నేరేడులో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఈ న్యూట్రియంట్లు చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.
యాపిల్ యాపిల్ చర్మాన్ని టైట్‌గా, గ్లోయింగ్‌గా ఉంచుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి ట్యానింగ్, సన్‌బర్న్ సమస్యల్ని పోగొడుతుంది.