Lucknow Pitch Curator: రెండో టీ20 మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అసహనం.. పిచ్‌ క్యురేటర్‌పై వేటు!

IND vs NZ, Lucknow Pitch Curator Sacked after New Zealand Scores 99 Runs. భారత్, న్యూజిలాండ్‌ రెండో టీ20 మ్యాచ్‌కు వేదికైన లక్నో పిచ్‌ను తయారు చేసిన క్యురేటర్‌పై వేటు పడిందని సమాచారం తెలుస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 31, 2023, 03:14 PM IST
  • రెండో టీ20 మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అసహనం
  • పిచ్‌ క్యురేటర్‌పై వేటు
  • 19 పరుగులే టాప్‌ స్కోర్‌
Lucknow Pitch Curator: రెండో టీ20 మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అసహనం.. పిచ్‌ క్యురేటర్‌పై వేటు!

IND vs NZ 2nd T20 Lucknow Pitch Curator Sacked After New Zealand Scores 99 Runs: లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆదివారం (జనవరి 29) ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌పై ఆతిథ్య భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 రన్స్ మాత్రమే చేసింది. మిషెల్‌ శాంట్నర్‌ చేసిన 19 పరుగులే టాప్‌ స్కోర్‌. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కూడా చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (26 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. 

లక్నో పిచ్ బౌలర్లకు బాగా సహకరించింది. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగిపోయారు. పిచ్‌పై బంతి బాగా టర్న్ అయింది. బంతి గింగిరాలు తిరగడంతో బ్యాటర్లు ఒక్కో పరుగు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. దాంతో టీ20 ఫార్మాట్‌కు ఇలాంటి పిచ్‌ సరైంది కాదనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. మాజీలతో సహా భారత తాత్కాలిక కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా కూడా లక్నో పిచ్‌పై అసహనం వ్యక్తం చేశారు. లక్నో వికెట్ తనను షాక్‌కు గురి చేసిందని మ్యాచ్ అనంతరం హార్దిక్ చెప్పాడు. ఈ క్రమంలో ఈ పిచ్‌ను తయారు చేసిన క్యురేటర్‌పై వేటు పడిందని సమాచారం తెలుస్తోంది. 

లక్నో పిచ్‌కు ప్రస్తుతం ఉన్న క్యురేటర్‌ను తొలగించి.. అనుభవజ్ఞుడైన సంజీవ్‌ కుమార్‌ అగర్వాల్‌ను నియమించారట. 'భారత్, న్యూజిలాండ్‌ రెండో టీ20 మ్యాచ్‌కు ముందువరకు ఇదే పిచ్‌ మీద దేశవాళీ మ్యాచ్‌లు చాలా జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం క్యురేటర్‌ కనీసం రెండు స్ట్రిప్‌లను వదిలి ఉంటే బాగుండేది. సర్ఫేస్‌ ఎక్కువగా ఉపయోగించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో.. పిచ్‌ను సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరకలేదు' అని ఓ జాతీయ మీడియాతో యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌ వర్గాలు వెల్లడించాయి. 

సంజీవ్‌ కుమార్‌కు అదివరకు బంగ్లాదేశ్‌లోనూ పిచ్‌లను తయారు చేశారు. అతడికి చాలా అనుభవం ఉంది. బీసీసీఐ సీనియర్‌ క్యురేటర్ తపోష్ ఛటర్జీతో కలిసి సంజీవ్‌ పని చేశారు. ఈ విజయంతో భారత్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

Also Read: Ellyse Perry Pics: అందంతో మతులు పోగొడుతున్న మహిళా క్రికెటర్‌.. నెట్టింట వైరల్‌గా మారిన హాట్ స్టిల్స్!  

Also Read: Virat Kohli Rishikesh: న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు బ్రేక్.. ఆశ్రమాల చుట్టూ విరాట్ కోహ్లీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News