Airtel Postpaid Plans: వినియోగదారులు చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను వినియోగించడానికే ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా మధ్యతరగతి వారి విషయానికొస్తే తక్కువ ధరలతో కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్‌లకే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ఇదే విషయంలో భారతి ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంతకముందు నిలిపివేసినట్లు ప్రకటించిన చౌకైన ప్లాన్‌ను దాదాపు రూ.56 పెంచింన విషయం అందరికీ తెలిసిందే. అయితే రూ.99 ప్లాన్ ఇప్పుడు రూ.155కి అందుబాటులోకి రానుంది.
ఈ రాష్టాల్లో పెంచుతూ నిర్ణయం:
భారతి ఎయిర్టెల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అధికారిక ప్రకట ద్వారా ఇలా తెయజేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఈ కొత్త ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికీ ఈ ఫ్లాన్ ధరలు పెరగడానికి కారణాలేంటో తెలపలేదు ఎయిర్టెల్ భారతి.
ఎయిర్‌టెల్ చాలా కాలంగా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడం గురించి ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే ఇతర ఛార్జీల విషయాలను దృష్టిలో పెట్టుకుని రూ.129 ఉన్న ప్లాన్ ధర రూ.300కి మరింత పెంచబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇతర ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి ఒక వేళ పెరిగితే ఎంత వరకు ధరలను పెంచుతారన్న విషయం తెలియాల్సి ఉంటుంది.
Airtel 155 ప్లాన్ వివరాలు:
ఎయిర్‌టెల్ రూ.155 ప్లాన్ 28 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ఇందులో 1GB డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు 300 SMSలు కూడా వస్తాయి. నవంబర్ 2022లో హర్యానా, ఒడిశాలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసిన తర్వాత.. మళ్లీ రూ. 155 ధరతో ఈ ప్లాన్‌ను రూపొందించారు.
Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి
Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Airtel Postpaid Plans: ఎయిర్టెల్ వినియోగదారులకు భారీ షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ పెంచుతూ నిర్ణయం..