Happy Pongal 2023: మకర సంక్రాంతి వెనుక ఇన్ని కధలు ఉన్నాయా?

Story of Makar Sankranthi: సాధారణంగా మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే చాలామంది సూర్యుడు ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు అంటారు కానీ దాని వెనుక అనేక కధలు ఉన్నాయి. ఆ వివరాలు 

Last Updated : Jan 13, 2023, 02:38 PM IST
Happy Pongal 2023: మకర సంక్రాంతి వెనుక ఇన్ని కధలు ఉన్నాయా?

Back Ground Story of Makar Sankranthi: సాధారణంగా మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే చాలామంది సూర్యుడు ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు అలాగే పంటలు చేతికొస్తాయి కాబట్టి మకర సంక్రాంతి చేసుకుంటూ ఉంటామని చెబుతూ ఉంటారు. కానీ దానికి అనేక కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందులో ఒకటి గంగ అవతరించిన రోజని కూడా చెబుతూ ఉంటారు.

దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే పూర్వం సగరుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు 60000 మంది కొడుకులు కాగా ఒకసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి తపస్సు భంగం చేయడంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మారుస్తాడు. అయితే శాపం విమోచన అడిగితే ఆ బూడిద గుట్టలు మీద గంగ ప్రవహిస్తే అప్పుడు వారి ఆత్మ శాంతించాలని చెబుతారు. అయితే ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేల మీదకు తీసుకొస్తారు అంటే సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడే ఆ పని చేయగలిగాడు. అలా ఆయన వలన సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు వచ్చిందని ఒక కథ.

అయితే సంక్రాంతికి గంగిరెద్దుల ఆటలు వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది, అదేమిటంటే పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడు కడుపులో ఉండేలా వరం కోరుతాడు. భోళా శంకరుడు నిజంగానే వరం ఇచ్చేయడంతో చివరికి శివుని బయటకు తీసుకు రావడానికి పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. దేవతలంతా తల ఒక వాయిద్యాలు పట్టుకుని నందిని అలంకరించుకుని గజరాజు వద్దకు వెళ్తారు. వీళ్ళ ప్రదర్శన చూసి మెచ్చిన గజాసురుడు వరం అడిగితే తన పొట్టలో ఉన్న శివుడిని బయటికి పంపమని అడుగుతార.  

అలా ఆరోజు శివుడిని విడిపించేందుకు వాళ్లంతా కట్టిన వేషాలనే ఇప్పటికీ గంగిరెద్దుల ఆటగా మనవాళ్లు పాటిస్తున్నారనే ప్రచారం ఉంది. అదే విధంగా కనుమ రోజు ఎక్కువగా చాలా ప్రాంతాల్లో పశువులను పూజిస్తూ ఉంటారు అలా పూజించడం ఎందుకు అనే విషయం మీద కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి తల స్నానం చేయాలి నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మంటాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలని చెబుతాడు.

కోపం వచ్చిన శివుడు ప్రజల రోజు తినాలంటే చాలా ఆహారంగా కావాలి కదా ఆహారం పండించేందుకు నువ్వే సాయపడాలి అని భూమి మీదకి నదిని పంపుతాడు. అందుకే అప్పటినుంచి ఎద్దులను వ్యవసాయంలో వాడుతున్నారని ఒక కథ అందుకే కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజలు చేస్తారట. ఆంధ్రప్రదేశ్లో తక్కువ గాని తెలంగాణలో సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అంటారు. దీని వెనుక మరో కథ ఉంది, అదేమంటే సంక్రాంతితో ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది కాబట్టి ఇది దేవతలకు పగలు అని చెబుతారు ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారు కాబట్టి దేవతలకు స్వాగతం పలికేందుకు గాలిపటాలని ఎగరవేయాలని అప్పట్లో చెప్పేవారట.  దాన్ని ఇప్పుడు పతంగుల పండుగగా జరుపుకుంటున్నారు.

ఇక హరిదాసుల సంకీర్తనలతో కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా లోగిళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతి సందర్భంగా మాత్రమే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు, అసలు ఈ హరిదాసు అంటే ఎవరంటే సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని పెద్దలు నమ్ముతారు. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నం అని చెబుతారు అందుకే ఎప్పటికీ ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరట. బిక్ష పూర్తి అయి  ఇంటికి చేరుకున్నాకే దానికి కిందకి దించి భద్రపరుస్తారట.
Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!

Also Read: AP Govt Focus: 'వీర సింహారెడ్డి'పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. స్పెసల్ షో చూసిన అధికారులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 
 

Trending News